Dharmendra (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Dharmendra: డిశ్చార్జ్ అయినప్పటికీ క్రిటికల్‌గానే ధర్మేంద్ర హెల్త్.. వీడియో వైరల్!

Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Bollywood Actor Dharmendra) ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఇటీవల వ్యాపించిన అనేక వదంతులకు, వీడియోలకు ఆయన కుటుంబ సభ్యులు గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లుగా తాజాగా వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరికొందరు, ఇది వారి ప్రైవేట్ వీడియో.. ఇలా ఎలా పబ్లిష్ చేస్తారంటూ సీరియస్ అవుతున్నారు. ‘మీడియా అనవసరంగా అతిగా స్పందిస్తూ అబద్ధపు వార్తలను వ్యాప్తి చేస్తోంది. మా నాన్నగారు కోలుకుంటున్నారు. దయచేసి మా కుటుంబ గోప్యతను గౌరవించండి’ అని కుమార్తె ఈషా డియోల్ (Esha Deol) అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయినా కూడా ఎలా వీడియో తీశారో? వీడియో తీశారు సరే.. ఇలా పబ్లిగ్గా పెట్టడం ఏంటి? అని నెటిజన్లు కొందరు క్వశ్చన్ చేస్తున్నారు.

Also Read- Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

నెటిజన్లు ఫైర్

కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ప్రస్తుతం ఇంట్లోనే వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే.. ఆయన పరిస్థితి విషమంగా ఉందనేది అర్థమవుతుంది. సన్నీ డియోల్, బాబీ డియోల్ వంటి వారంతా ఈ వీడియోలో బాధపడటం గమనించవచ్చు. ధర్మేంద్ర త్వరగా కోలుకుని, మళ్లీ మామూలు వ్యక్తిలా కనిపించాలని యావత్ సినీ పరిశ్రమ, ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న వీడియో ఆసుపత్రిలోదా? లేదంటే ఇంటిలోదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. వీడియో చూస్తుంటే మాత్రం.. ఇంట్లోనే అన్నీ సెట్ చేసినట్లుగా అర్థమవుతోంది. బయట చెట్లు, అవి చూస్తుంటే, ఇది వారి ఇల్లేనని తెలిసిపోతుంది. ఇంట్లోనే ధర్మేంద్ర ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన అన్నింటిని ఏర్పాటు చేశారు. ఈ వీడియోను వారి ఫ్యామిలీ మెంబర్స్‌లోని వారే తీసి ఉంటారనేలా కూడా.. కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Read- SS Rajamouli: ఎవరు పడితే వాళ్లు రావడానికి.. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు! గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు వచ్చే దారిదే!

ప్రార్థనలు ఫలించాలి

నిజమే.. ఈ కష్ట సమయంలో ఆ ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్‌గా ఉండాలి కానీ, ఇలా వీడియోలు తీసి వారి గోప్యతను పబ్లిక్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే, ధర్మేంద్ర అభిమానులకు ఆయన హెల్త్ అప్డేట్ ఏంటనేది, ఎప్పటికప్పుడు డాక్టర్స్ బులిటెన్ విడుదల చేస్తే బాగుంటుందని కూడా కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే, ఎందరో అభిమానించిన స్టార్ ఆయన. అలాంటి నటుడు, హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, అభిమానుల్లో ఆందోళన ఉండటం సహజమే. ఇలాంటి వీడియోలు లీక్ కాకుండా కూడా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి. బాలీవుడ్ ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని, మళ్లీ సాధారణ జీవితం గడపాలని దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలు ఫలించాలని కోరుకుందాం..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Directors: ట్రెండ్ మారుతోంది.. దర్శకులే హీరోలుగా!

Koragajja: ‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’.. గూస్‌బంప్స్ తెప్పించే మరో రూటెడ్ కథ వస్తోంది!

Gadwal: గద్వాలలో దొంగల హల్చల్.. వరుస ఘటనలతో జనాల బెంబేలు

Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

POCSO Case: పోక్సో కేసులో దోషికి తగిన శిక్ష విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్..