SS Rajamouli (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

SS Rajamouli: ఎవరు పడితే వాళ్లు రావడానికి.. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు! గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు వచ్చే దారిదే!

SS Rajamouli: నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో జరగనున్న గ్లోబ్ ట్రాట‌ర్ ఈవెంట్‌ (Globetrotter Event)పై ఉన్న సందేహాలన్నింటికీ సమాధానమిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వేడుకపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరవ్వాలంటే విఐపి పాస్ కోసం రూ. 10 నుంచి 15 వేలు ఖర్చు పెట్టి కొనుక్కోవాలని, జనరల్ ఎంట్రీకి రూ. 2 నుంచి 5 వేలు, ఫ్యాన్ పాస్ వెయ్యి నుంచి రెండున్నర వేల వరకు ఖర్చు చేయాలనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయనేది కూడా కొందరు సూచనలు చేస్తున్నారు. ఇలాంటి వార్తలన్నింటికీ సమాధానమిస్తూ.. తాజాగా రాజమౌళి ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఓపెన్ ఈవెంట్ కాదని, పిజికల్ పాసెస్ కంపల్సరీ అని, అలాగే పోలీసులు విధించిన నిబంధనలను కూడా ఇందులో చెప్పారు. ఆయన ఈ వీడియోలో మాట్లాడుతూ..

ఇది ఓపెన్ ఈవెంట్ కాదు

‘‘మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే.. మీ అందరి సహకారం చాలా చాలా అవసరం. మన ఈవెంట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని.. పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు ఈసారి చాలా స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం కచ్చితంగా పాటించాలి. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్లు మాత్రమే ఈ ఈవెంట్‌కు రావాలి. నేను కొన్ని వీడియోలలో చూశాను. ‘ఇది ఓపెన్ ఈవెంట్.. ఎవరు పడితే వాళ్లు రావచ్చు, ఇక్కడకు వచ్చిన తర్వాత అందరినీ లోపలికి పంపిస్తారు, అలాగే ఆన్‌లైన్‌లో పాస్‌లు అమ్ముతున్నారు’ అనేవి ఏవి నిజం కాదు. వీటిని నమ్మవద్దు. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి. అవి ఉన్నవాళ్లు మాత్రమే రావాలి.

Also Read- Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

ఈ ఈవెంట్‌కు ఎలా రావాలంటే..

నవంబర్ 15వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ (విజయవాడ హైవే పై ఉన్న మెయిన్ గేట్) పూర్తిగా మూసివేయబడుతుంది. మన ఈవెంట్‌కు ఎలా రావాలంటే.. ‘విజయవాడ సైడ్ నుంచి వచ్చే వాళ్లు.. రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కంటే ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్‌పూర్‌కి వెళుతుంది. అనాస్‌పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్‌కు వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్లు ORR ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకు వచ్చి, యూటర్న్ తీసుకుని, సర్వీస్ రోడ్‌లోని సాంఘీ మీదగా మన ఈవెంట్‌కు రావచ్చు. గచ్చిబౌలి నుంచి వచ్చే వాళ్లు ORR మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర కిందకు దిగిపోయి, సర్వీస్ రోడ్‌లో నుంచి రైట్‌కు తీసుకుంటే సాంఘీ నుంచి ఈవెంట్‌కు చేరుకోవచ్చు’ అని చెప్పారు.

వాళ్ల మాటలు అస్సలు వినవద్దు

ఇంకా ఆయన మాట్లాడుతూ.. పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. వాటిని స్కాన్ చేస్తే.. క్లియర్‌గా వచ్చే మార్గాలకు సంబంధించి వీడియోలు ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటే, అవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవే కాకుండా, మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, యూటర్న్ తీసుకోండి అని.. పార్కింగ్ వరకు ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు. అరేయ్.. నాకు షార్ట్ కట్ తెలుసురా.. ఇలా వెళ్లిపోదాం రా అని చెప్పేవాడు ఒకడుంటాడు. వాళ్ల మాటలు అస్సలు వినవద్దు. ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి, ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఈవెంట్‌కు రావచ్చు. ఈ ఈవెంట్‌కు మీకు ఏవైతే గేట్స్ ఎసైన్ చేయబడ్డాయో.. అవి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. కాబట్టి, మీరు ఎర్లీగా వస్తే.. పార్కింగ్‌లో మంచి ప్లేస్‌, ఈవెంట్‌లో మంచి సీట్స్ దొరుకుతాయి.

Also Read- SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?

ఆ ఏజ్ వాళ్లకు నో ఎంట్రీ..

18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి, సీనియర్ సిటిజన్స్‌కు ఈసారి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దయచేసి వారంతా ఇంటి వద్దనే ఉండి, జియో హాట్‌స్టార్ లైవ్‌లో చూడమని కోరుతున్నాను. రీసెంట్‌గా జరిగిన రకరకాల ఈవెంట్స్‌ను దృష్టిలో పెట్టుకుని, పోలీస్ వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉండబోతున్నారు. కమిషనర్ పర్సనల్‌గా కూడా చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా, ఈవెంట్ క్యాన్సిల్ చేయబడుతుందని స్ట్రిక్ట్‌గా చెప్పారు. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం కాబట్టి.. వారికి పూర్తిగా సహకరించి, మన ఈవెంట్‌ను బ్రహ్మాండంగా చేసుకుందాం’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Delhi blast Dubai link: ఢిల్లీ పేలుడు కేసులో మరో షాకింగ్.. దుబాయ్‌లో అనుమానితులు!

Parasakthi Teaser: పెను సైన్యమై కదలిరా.. ‘పరాశక్తి’ టీజర్ ఎలా ఉందంటే?

Jubilee Hills Counting: రేపు జూబ్లీహిల్స్ కౌంటింగ్.. ఫలితం ఎప్పటిలోగా వస్తుందంటే?

Dharmendra: డిశ్చార్జ్ అయినప్పటికీ క్రిటికల్‌గానే ధర్మేంద్ర హెల్త్.. వీడియో వైరల్!

ACB Raid: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్.. లంచం ఎంతంటే?