Tollywood: పాన్-ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ సక్సెస్ పార్టీకి రష్మిక హాజరైంది. అయితే, ఆ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య జరిగిన క్యూట్ మూమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సక్సెస్ పార్టీలో రష్మిక–విజయ్ లవ్ మూమెంట్
ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ షేర్ చేసిన వీడియోలో విజయ్ దేవరకొండ రష్మికను అభినందిస్తూ ఆమె చేతిని పట్టుకుని ముద్దాడారు. ఈ రొమాంటిక్ మూమెంట్ ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. నెటిజన్లు “ఏమి క్యూట్ కపుల్.. ”, “ వారి కెమిస్ట్రీ మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
విజయ్–రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగిందని టాక్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా 2025 అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో ప్రైవేట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే, ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. మరి, వారి మనసులో ఏముందో .. ఎప్పుడు అన్నౌన్స్ చేస్తారో చూడాలి. వీరిద్దరూ మొదటగా 2018లో రిలీజ్ అయినా ‘గీత గోవిందం’ సినిమా సెట్స్‌లో పరిచయమయ్యారు. తర్వాత ‘డియర్ కామ్రేడ్’ (2019) లో మళ్లీ జంటగా నటించారు.
వీరి వివాహం ఎప్పుడు? ఎక్కడంటే?
తాజా సమాచారం ప్రకారం, ఈ స్టార్ జంట తమ వివాహ వేడుకను 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సన్నిహితుల మధ్య జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ
‘ది గర్ల్‌ఫ్రెండ్’ రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో రూపొందిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం. దీనిలో రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు వచ్చిన సక్సెస్‌తో రష్మిక కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ ఆమె ఖాతాలో వేసుకుంది.
