Red book, black book
Politics

Telengana:‘బుక్’పాలిటిక్స్

  • తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన రెడ్ బుక్, బ్లాక్ బుక్
  • ప్రతిపక్షంలో ఉన్నప్పడు తమని వేధించిన అధికారుల పేర్లు
  • రెడ్ బుక్ లో ఎంటర్ చేసుకున్న లోకేష్
  • తెలంగాణలోనూ మొదలైన బ్లాక్ బుక్ పాలిటిక్స్
  • తమని వేధించిన అధికారుల పేర్లు బ్లాక్ బుక్ లో
  • అంటూ బెదిరిస్తున్న బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి
  • రాజకీయ నేతల బుక్ రాజకీయాలకు బలవుతున్న అధికారులు
  • ముందు స్కాముల్లో బుక్ కాకుండా చూసుకోమని
  • బీఆర్ఎస్ నేతలపై ట్రోలింగ్స్ చేస్తున్న నెటిజెన్స్

telugu states hot topic red book and black book Lokesh and padi kaushik Reddy :

తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ‘బుక్ ’ రాజకీయాలు బుస్సుమంటున్నాయి. అవే రెడ్ బుక్, బ్లాక్ బుక్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు అన్నీ రెడ్ బుక్ లో రాసినట్లు లోకేష్ అనేక సార్లు ప్రస్తావించారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో వీళ్లను ఇబ్బందులకు గురిచేసిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అలాగే లోకేష్ దారిలోనే ఇక్కడ తెలంగాణలోనూ బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తమని తమ నేతలను ఇబ్బందుల పాలు చేస్తున్న నేతల పేర్లు బ్లాక్ బుక్ లో నోట్ చేసుకుంటున్నానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచమంతా డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న రోజులివి. విద్యార్థులు కూడా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లతో అలవాటుపడిపోయారు. పుస్తకాలే మాయమైపోతున్న ఈ రోజుల్లో ఈ అధునాతన పొలిటికల్ లీడర్లు మాత్రం రెడ్ బుక్, బ్లాక్ బుక్ అంటూ అధికారులను భయపెట్టడం చూస్తుంటే ప్రపంచం ఎటువైపు వెళుతోందా అనిపించక మానదు.

రెడ్ బుక్ తో అధికారులలో ఆందోళన

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌ బుక్‌ బాగా ఫేమస్‌. యువగళం పాదయాత్ర సమయంలో రెడ్‌ బుక్‌ చూపించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌… టీడీపీపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులకు వార్నింగ్‌ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే అంతు చూస్తాం. ఎవరినీ వదలం.. అని హెచ్చరించారు. వైసీపీకి కొమ్ముకాసే అధికారులందరి పేర్లు రెడ్‌ బుక్‌లో నమోదు చేస్తున్నామని నారా లోకేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెదిరిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ లోనూ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘోరంగా ఓడిపోవడం.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జీరో కు పడిపోవడం… కల్వకుంట్ల చంద్రశేఖర రావును వేధిస్తున్నాయి. అంతేకాకుండా గులాబీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటుంది. రోజుకొక ఎమ్మెల్యే.. కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.అటు అధికారులు కూడా గులాబీ పార్టీ నేతలపై కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. పోలీసులైతే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హుజరాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అధికారి అయితే గులాబీ పార్టీకి ఇబ్బందులు పడుతున్నారో..వారి పేర్లు బ్లాక్ బుక్ లో రాస్తున్నామని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

పబ్లిక్ ట్రోలింగ్

మరో నాలుగు సంవత్సరాలలోనే గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని… బ్లాక్ బుక్ లో ఉన్న పేర్లను బయటకు తీస్తామని… ఆ తర్వాత వారి తాటతీస్తామని హెచ్చరించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీలో కూడా బ్లాక్ బుక్ అంశం హాట్ టాపిక్ అయింది. అయితే నారా లోకేష్ చెప్పినట్లుగానే..పాడి కౌశిక్ రెడ్డి చెబుతున్నారు. అంటే ఏపీలో సీన్ తెలంగాణలోనూ రిపీట్ కాబోతుందని..కొంతమంది అంటున్నారు. బుక్ లో పేర్లు రాయడం కాదు..ముందు అవినీతి స్కాముల్లో సదరు బీఆర్ఎస్ నేతలు బుక్ కాకుండా చూసుకోండని జనం ట్రోలింగ్ చేస్తున్నారు.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?