Sandeep-Reddy-Vanga( image:X)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi in Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ కామియోపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి.. కానీ చిరుతో..

Chiranjeevi in Spirit: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇటీవల, ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి గారు అతిథి పాత్రలో నటించబోతున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమయ్యాయి. ప్రభాస్, చిరంజీవి కాంబినేషన్ అంటే అభిమానులకు పండగే అని అంతా అనుకున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో, సందీప్ రెడ్డి వంగా జిగిరీస్ అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పిరిట్ లో మెగాస్టార్ చేయబోతున్నారా లేదా అనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Read also-Tollywood movie budget: టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం బడ్జెట్ పెరుగుతూ వస్తుంది.. దీనికి కారణం ఏంటంటే?

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా… ‘స్పిరిట్’ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నారన్న వార్తలను ఖండించారు. ఆయన ఆ సినిమాకు సంబంధించిన తండ్రి పాత్రగానీ లేదా ఇతర ఏ పాత్రలోనూ నటించడం లేదని తేల్చి చెప్పారు. అవి కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ క్లారిటీతో, మెగాస్టార్‌ను ప్రభాస్‌తో కలిసి తెరపై చూడాలని ఆశించిన అభిమానులు కొంచెం నిరాశ చెందారు. కానీ మెగాస్టార్ చిరంజీవికి సందీప్ రెడ్డి వంగా వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. తన ఆఫీసులో కూడా చిరంజీవి పోస్టర్ ఉంటుందని గతంలోనే తెలిపారు. ఈ అభిమాన దర్శకుడు చిరంజీవితో కలిసి పనిచేయాలనే తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇప్పటికే మెగాస్టార్ యువదర్శకులతో ముందుకు సాగుతున్నారు. రానున్న రోజుల్లో సందీప్ మెగాస్టార్ తో చేస్తే మాత్రం ఆ సినిమా పాన్ ఇండియా స్టాయి లో సంచలనం సృష్టించడం ఖాయం అవుతుంది.

Read also-Bigg Boss promo: సుమన్ శెట్టితో స్టెప్పులేయించిన బిగ్ బాస్ మహారాణులు.. ఏంది భయ్యా ఆ టాస్కులు..

“‘స్పిరిట్’లో చిరంజీవి గారు నటించడం లేదు. కానీ, నేను భవిష్యత్తులో చిరంజీవితో సోలోగా ఒక సినిమా తప్పకుండా చేయాలని అనుకుంటున్నాను” అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. తనదైన స్టైల్, రైటింగ్, టేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే సందీప్ రెడ్డి వంగా.. తన అభిమాన హీరో అయిన చిరంజీవి గారి కోసం ప్రత్యేకంగా ఒక కథను సిద్ధం చేస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో అని సినీ విశ్లేషకులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘స్పిరిట్’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా.. చిరంజీవితో సినిమా కోసం ఎప్పుడు కథను సిద్ధం చేస్తారు, ఈ కలయిక ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి. చిరంజీవి కూడా యువ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Just In

01

Jupally Krishna Rao: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Telangana Police: డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై పోలీసు సంఘం సీరియస్

Jogipet: జోగిపేటలో పట్టపగలు పుస్తెలతాడు చోరీ.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ!

Prakash Raj: ‘తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే’.. ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు

Uttam Kumar Reddy: తెలంగాణ సరికొత్త రికార్డు.. స్వతంత్ర భారతంలో ఇదే తొలిసారి