king-nagarjuna(X)
ఎంటర్‌టైన్మెంట్

Nagarjuna: వారికి కూడా ఆ సత్తా లేదంటున్న కింగ్ నాగార్జున.. ఎందుకంటే?

Nagarjuna: రామ్ గోపాల్ వర్మ (RGV) తొలి ప్రయత్నంగా 1989లో విడుదలైన కల్ట్ క్లాసిక్ ‘శివ’ నవంబర్ 14న కొత్త రూపంలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున, అమల అక్కినేని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సంచలన చిత్రం… తెలుగు సినిమా రూపురేఖలను మార్చి, క్యాంపస్ రాజకీయాలు, హింసను వాస్తవికంగా చూపించి కొత్త ఒరవడి సృష్టించింది. ఈ సినిమా 4K రీమాస్టర్డ్ వెర్షన్‌ విడుదల సందర్భంగా, కింగ్ నాగార్జున మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

Read also-Santana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదలైంది..

తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన, మైలురాయిగా నిలిచిన చిత్రాలలో ఒకటైన ‘శివ’ను అందించినందుకు నాగార్జున దర్శకుడు ఆర్జీవీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా తన హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. “కొన్ని రోజుల క్రితం నేను ‘శివ’ను మళ్లీ చూశాను. 4K నాణ్యతలో ఆ క్లాసిక్ చిత్రాన్ని చూస్తుంటే, పూర్తిగా కొత్త సినిమా చూసినట్లు అనిపించింది. నిజంగా అది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన అనుభవం అని నాగార్జున తన సంతోషాన్ని పంచుకున్నారు.

‘శివ’ విడుదల సమయంలో ఎదురైన పరిస్థితులను, తన తండ్రి దివంగత అక్కినేని నాగేశ్వరరావు స్పందనను నాగార్జున ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత నాన్న చూశారు. ఆ సమయంలో సినిమాపై అనేక రకాలైన కామెంట్లు వస్తున్నప్పటికీ, ఆయన నన్ను కారు డ్రైవ్‌కు తీసుకెళ్లారు. అప్పుడు ఆయన నాతో ‘ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది, నువ్వు విజయం సాధించావు’ అని చెప్పారు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి” అని నాగార్జున భావోద్వేగంతో పంచుకున్నారు.

Read also-Cult Conversation: కల్ట్ క్లాసిక్ ‘శివ’ కోసం కదిలొచ్చిన ముగ్గురు మొనగాళ్లు.. ఫైర్ చాట్ ఎలా ఉందంటే?

కుమారులు రీమేక్ చేయలేరు

అయితే, ఈ ఇంటర్వ్యూలో నాగార్జున చేసిన అత్యంత సంచలన వ్యాఖ్య రీమేక్ గురించే. ఇంతటి ప్రభావాన్ని సృష్టించిన ‘శివ’ చిత్రాన్ని తన కుమారులు, యువ నటులు నాగ చైతన్య లేదా అఖిల్ అక్కినేని ఎవరైనా రీమేక్ చేస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నాగార్జున నవ్వుతూ, “లేదు. చై (నాగ చైతన్య), అఖిల్‌లకు ‘శివ’ సినిమాను రీమేక్ చేసే దమ్ము లేదు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్య… ఆ సినిమాకు ఉన్న అపారమైన కల్ట్ స్టేటస్‌ను, దాన్ని మళ్లీ తెరకెక్కించడంలో ఉండే సవాళ్లను తెలియజేస్తుంది. ఆ సినిమా స్థాయిని అందుకోవడం ప్రస్తుత తరానికి చాలా కష్టమనే ఉద్దేశంలోనే నాగార్జున ఈ మాట అని ఉండవచ్చు. అంతేకాకుండా, భార్య అమలతో కలిసి భవిష్యత్తులో మంచి కథ దొరికితే మరోసారి తెరపై సందడి చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు నాగార్జున ఈ సందర్భంగా వెల్లడించారు. మొత్తానికి, ‘శివ’ 4K రీ-రిలీజ్ అభిమానులకు ఒక పండగ లాంటిదని చెప్పవచ్చు.

Just In

01

BIBINagar Lake: ఆత్మహత్యలకు కేరాఫ్‌గా మారిన ఓ చెరువు.. ఎక్కడో తెలుసా..!

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. 2029 నాటికి ప్రతీ ఒక్కరికి సొంతిల్లు!

Bigg Boss promo: సుమన్ శెట్టితో స్టెప్పులేయించిన బిగ్ బాస్ మహారాణులు.. ఏంది భయ్యా ఆ టాస్కులు..

MLC Kavitha: జగదీష్ రెడ్డి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్​: రూ.900 కోట్ల భూ వ్యవహారంపై కలెక్టర్ ఫోకస్..!