ktr not appear after elections
Politics

KTR: పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ రియాక్షన్.. ట్విట్టర్‌లో కౌంటర్లు

BRS Party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపులను ఆపడానికి అధిష్టానం విజ్ఞప్తులు చేస్తున్నది. మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ, ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపులపై కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు.

అధికారంలో ఉన్నవారి శక్తి కంటే కూడా ప్రజల శక్తి గొప్పదని, బలమైనదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004-06 కాలంలో తమ పార్టీ నుంచి చాలా ఎమ్మెల్యేలు ఫిరాయింపులను ఎదుర్కొన్నామని వివరించారు. తెలంగాణ సమాజ ఆందోళనరూపం దాల్చి బలంగా ప్రతిస్పందించిందని, తత్ఫలితంగా కాంగ్రెస్ తలవంచక తప్పలేదని తెలిపారు. చరిత్ర పునరావృతం అవుతుందని ముక్తాయింపు ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. కేటీఆర్ ట్వీట్‌కు సెటైరికల్‌గా అనేక కామెంట్లు వెల్లువెత్తాయి. గతంలో టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కోలేదా? అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఓ నెటిజన్ కేటీఆర్ ట్వీట్‌లో కొన్ని మార్పులు చేసి సెటైర్ వేశారు. ‘అధికారంలో ఉన్నవారి శక్తి కంటే ప్రజా శక్తి గొప్పది. 2014-23 మధ్యకాలంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఫిరాయింపులను పాల్పడింది. ప్రజలు ఉద్యమరూపం తీసుకోవడంతో మేం/టీఆర్ఎస్ తలవంచింది. హిస్టరీ పునరావృతమైంది’ అని కేటీఆర్ ట్వీట్‌లో మార్పులు చేసి టీఆర్ఎస్ పార్టీని విమర్శించారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు