Sandeep-Reddy-Vanga( image:X)
ఎంటర్‌టైన్మెంట్

Cult Conversation: కల్ట్ క్లాసిక్ ‘శివ’ కోసం కదిలొచ్చిన ముగ్గురు మొనగాళ్లు.. ఫైర్ చాట్ ఎలా ఉందంటే?

Cult Conversation: సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఇద్దరు దర్శకులు, సందీప్ రెడ్డి వంగా , రామ్ గోపాల్ వర్మ కలిసి టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున (Nagarjuna)తో జరిగిన ‘కల్ట్ కన్వర్జేషన్’ ప్రస్తుతం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్జీవీ దర్శకత్వంలో నాగార్జున నటించిన ఐకానిక్ సినిమా ‘శివ’ (Shiva) 4K రీ-రిలీజ్ సందర్భంగా ఈ ముగ్గురు ట్రెండ్‌సెట్టర్‌లు ఒకే వేదికపై కూర్చుని సినిమా, క్రియేటివిటీ, సవాళ్ల గురించి చేసిన చర్చ అద్భుతంగా సాగింది. రామ్ గోపాల్ వర్మ 1989లో తీసిన ‘శివ’ చిత్రం తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పింది. నాగార్జునను యాక్షన్ హీరోగా నిలబెట్టిన ఈ సినిమా గురించి వంగా మాట్లాడుతూ, తను ఒక దర్శకుడిగా మారడానికి ‘శివ’ అందించిన ప్రేరణను గుర్తు చేసుకున్నారు. వర్మను తన ‘ఇన్‌స్పిరేషన్’గా భావిస్తానని వంగా చెప్పగా, వర్మ తనదైన శైలిలో వంగా బ్లాక్‌బస్టర్ సినిమా ‘యానిమల్’ విజయాన్ని అభినందించారు.

Read also-The Girlfriend: సక్సెస్ సెలబ్రేషన్స్‌కి సిద్ధమవుతున్న‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీమ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

ఈ సంభాషణలో అత్యంత ఆసక్తికరమైన భాగం, వర్మ తన పదునైన ప్రశ్నలతో వంగాను ఇరుకున పెట్టడం. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన అఖండ విజయం సాధించిన ‘బాహుబలి’ గురించి వర్మ అడుగుతూ, “నువ్వు ‘బాహుబలి’ లాంటి సినిమా చేయగలవా?” అని వంగాను ప్రశ్నించారు. ఈ అనూహ్య ప్రశ్నకు సందీప్ రెడ్డి వంగా కొద్దిసేపు తటపటాయించి, చివరికి “ఇప్పుడైతే లేదు, భవిష్యత్తులో ప్రయత్నిస్తాను సార్” అని బదులిచ్చారు. దీనికి వర్మ జోక్ చేస్తూ, “ట్రై చేస్తాననే సమాధానం కాదు, అవును లేదా కాదు చెప్పాలి. నువ్వు డిప్లమాటిక్‌గా ఉండకూడదు” అని మళ్లీ గ్రిల్ చేశారు. వంగా చివరకు, “నా తక్షణ సమాధానం ‘కాదు'” అని చెప్పగానే, వర్మ మళ్ళీ, “మంచిది, అయితే ‘బాహుబలి’ కంటే మంచి సినిమా చేయగలవా?” అని అడిగారు. దీనికి వంగా నవ్వుతూ “ప్రయత్నిస్తాను” అని చెప్పగా, వర్మ ఆ ప్రయత్నమే గొప్ప విజయమంటూ ప్రశంసించారు.

Read also-Gopigalla Goa Trip movie: ‘గోపిగాళ్ల గోవా ట్రిప్’లో ఏం జరిగిందో తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే..

మరో సరదా చర్చలో, వర్మ తన క్లాసిక్ సినిమా ‘శివ’ వంగా తొలి బ్లాక్‌బస్టర్ ‘అర్జున్ రెడ్డి’ ఒకే రోజు విడుదల అయితే ఏది ఎక్కువ వసూలు చేస్తుందని వంగాను అడిగారు. దీనికి సందీప్, ఏ మాత్రం ఆలోచించకుండా ‘శివ’ పేరు చెప్పగా, వర్మ దాన్ని ‘అతి వినయం’ అని కొట్టిపారేశారు. దానికి బదులుగా వంగా, “మీరు మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా తీయండి, అప్పుడు ప్రేక్షకులు ‘ఆర్జీవీ ఈజ్ ఆర్జీవీ’ అని అనాలి, ‘ఆర్జీవీ ఈజ్ బేక్’ అని కాదు” అని వర్మకు సవాలు విసిరారు. మొత్తంగా, ఈ ముగ్గురు సినీ దిగ్గజాల సంభాషణ, వారి వారి క్రియేటివ్ జర్నీలు, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, కొత్త దర్శకులకు స్ఫూర్తినిచ్చే అంశాలతో నిండి ఉంది. ‘శివ’ లాంటి కల్ట్ సినిమా వారసత్వం గురించి నాగార్జున మాట్లాడడం, వర్మ- వంగాల మధ్య జరిగిన ఈ ఫైర్‌సైడ్ చాట్ సినిమా అభిమానులకు ఒక గొప్ప విందు.

Just In

01

Gadwal District: నిధులు లేక నిరీక్షణ రెండేళ్ల నుంచి రాని గ్రాంట్లు.. చెక్కులు పాస్ కాక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు

Santana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదలైంది..

Balaram Naik: ప్రమాద రహిత సింగరేణి ధ్యేయంగా పనిచేయాలి : సీఎండీ ఎన్.బలరామ్

Anu Emmanuel: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో దుర్గ క్యారెక్టర్ నా కోసమే పుట్టింది.. అను ఇమ్మాన్యుయేల్

Kunamneni Sambasiva Rao: పేద ధనిక అంతరాలను తొలగించే ఏకైక మార్గం సోషలిజమే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు