12A Railway Colony: అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్ ఇదే..
12A-Railway-Colony( Image ;x)
ఎంటర్‌టైన్‌మెంట్

12A Railway Colony: అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..

12A Railway Colony: అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ’12A రైల్వే కాలనీ’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. హారర్ థ్రిల్లర్ నేపధ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో పొలిమెరా సిరీస్ ఫేమ్ కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు పొలిమెరా 2 రచయిత డా. అనిల్ విశ్వనాథ్ అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బేనర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. నాని కాసరగడ్డ ఎడిటింగ్, కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Read also-Prabhas: ప్రభాస్‌కు ఎందుకు అంత క్రేజ్.. పాన్ ఇండియా స్టార్‌ అవ్వడానికి రీజన్ ఇదే..

అల్లరి నరేష్ ఈ సినిమాలో.. రైల్వే కాలనీలో 12A నంబర్ ఇంటిలో నివసిస్తాడు. తన ఇంటి లో నుండి వింతగా కనిపించే పరానార్మల్ ఘటనలు గమనిస్తాడు. ఈ అసాధారణ రహస్యాలను అన్వేషించడానికి అతడు ప్రయత్నిస్తాడు, ఇది భయానకమైన ప్రపంచానికి ఆరంభం అవుతుంది. కథలో కాలనీలో ప్రతి మూలలో దాగి ఉన్న రహస్యాలు, మనస్తత్వ థ్రిల్, ప్రేమ కథ ఎమోషనల్ ఎలిమెంట్స్ మిళితమై, ఆకట్టుకునే అనుభవాన్ని అందిస్తుంది. డా. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా, సాయి కుమార్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

Read also-Jatadhara: బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ‘జటాధర’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

ట్రైలర్ ను చూస్తుంటే.. అల్లరి నరేష్ తనకు ఏదో అవుతుందని స్నేహితుడైన హర్ష కు చెబుతుంటాడు. నీకే ఎందుకు జరుగుతుంది.. మళ్లీ ఊహించుకుంటున్నావా..అంటూ అంటాడు. అంటే ఏదో తెలియని శక్తి నరేష్ ను డిస్టబ్ చేస్తున్నాయి. అక్కడ ఏవో ఉన్నాయని, ఎవరికి చెప్పినా నమ్మకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు.. పోలీసులను ఆశ్రయిస్తాడు. వారి నుంచి కూడా సపోర్ట్ రావపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో కొన్ని హత్యలు బయటపడతాయి. వాటిని ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనేదాని గురించి సస్పెన్స్ ఉంటుంది. ఈ ట్రైలర్ త్రిల్లర్ ఎలిమెంట్స్ తో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. బీమ్స్ అందించిన సంగీతం ప్రతి సీన్ కు తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫర్ రమేష్ రెడ్డి ప్రతి ఫ్రేమ్ ను చాలా ఆసక్తి క్రియేట్ చేసే విధంగా తీశారు. ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

GHMC: జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణతో నగర పాలనలో నూతన దశ మొదలు!

Shivaji Controversy: తొడలు కనబడుతున్నాయనే.. నన్ను చూస్తున్నారు.. శివాజీ వివాదంపై శ్రీరెడ్డి కౌంటర్

Gold Rates: న్యూ ఇయర్ కు ముందే ఈ రేంజ్ లో గోల్డ్ రేట్స్ పెరిగితే తర్వాత ఇక కష్టమేనా?

GHMC: 29న స్టాండింగ్ కమిటీ మీటింగ్.. కమిటీ ముందుకు రానున్న 15 అంశాల అజెండా!

Massive Highway Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 50 వాహనాలు.. 26 మందికి పైగా