Jatadhara: బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ‘జటాధర’
Jatadhara ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Jatadhara: బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ‘జటాధర’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Jatadhara: ప్రేమ్ కథా చిత్రంతో తెలుగు సినీ తెరకు పరిచయమైన సుధీర్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ హీరో నటించిన జటాధర సినిమా నవంబర్ 7 న రిలీజ్ అయింది.  వెంకట్ కళ్యాణ్ తెరకెక్కించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తన తెలుగు డెబ్యూ తో అదరగొట్టింది. మొదటి వీకెండ్ లోనే రూ. నాలుగు కోట్లకి పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. సోమవారం కూడా తన హోల్డ్ ను నిలుపుకుంది. నాలుగు రోజుల కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే..

మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 1.47 కోట్లు కలెక్ట్ చేసింది.

రెండో రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 1.44 కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read: Police: ఆలయాల్లో చోరీలు.. అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్.. ఎన్ని లక్షలు స్వాధీనం చేసుకున్నారంటే?

మూడో రోజుకు బాక్సాఫీస్ వద్ద రూ. 1.71 కోట్లు కలెక్ట్ చేసింది.

నాలుగో రోజుతో కలిపి బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ. 5.10 కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read: Dharmendra Health Update: బతికి ఉండగానే చంపేస్తారా? మీడియాపై ధర్మేంద్ర కుమార్తె ఇషా, భార్య హేమామాలిని ఫైర్

జటాధర బాక్సాఫీస్ రెస్పాన్స్:

గట్టి పోటీ ఉన్న కూడా ఈ సినిమా తట్టుకుని, నిలబడి జటాధర మంచి ఓపెనింగ్స్ తో  ప్రారంభమై, రోజు రోజుకీ తన కలెక్షన్స్ ను పెంచుకుంటోంది. ముఖ్యంగా సుధీర్ బాబు చేసిన “శివ తాండవం” సీక్వెన్స్, క్లైమాక్స్‌లోని దైవిక శక్తి, ఎమోషనల్ ఇంటెన్సిటీ.. ఈ సినిమా సౌత్ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసాయి.

Also Read: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం.. సాయంత్రం 6 గంటల్లోపు వస్తేనే ఓటింగ్ కు ఛాన్స్!

తెలుగు రాష్ట్రాల్లో చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఇంత స్థిరమైన కలెక్షన్లు సాధిస్తే అవి విజయవంతమైనవిగా చెబుతుంటారు. ఇప్పుడే అదే స్థాయికి ఈ సినిమా చేరుకుంది. సౌత్‌లో పాజిటివ్ టాక్ కొనసాగుతుండగా, హిందీ వెర్షన్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఉమేశ్ కుమార్ బన్సల్, శివిన్ నారాంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా నిర్మాతలుగా ఉన్నారు.
అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా కో-ప్రొడ్యూసర్లు గా వర్క్ చేసారు. దివ్య విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పని చేశారు.

Just In

01

Mysuru Palace: మైసూరు ప్యాలెస్ దగ్గర హీలియం సిలిండర్ పేలుడు.. ముగ్గురు మృతి

BRS Party: ప్రభుత్వ దూకుడు గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి.. పార్టీ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళం!

Shivaji Inquiry: మహిళా కమీషన్ ముందు హాజరైన్ శివాజీ . . కమీషన్ అడిగిన ప్రశ్నలు ఏంటంటే?

City Police Annual Press Meet: హైదరాబాద్‌లో 405 అత్యాచారాలు.. 69 దారుణ హత్యలు.. క్రైమ్ చిట్టా విప్పిన సజ్జనార్

Telangana Education: కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా సర్కారు బడి.. నాణ్యమైన విద్యే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు!