Viral Video: ఒక్క వీడియో మాజీ మంత్రిని కదిలిచింది. రాయిపూర్ నుండి వొచ్చి యువకుడిని బ్యాటరీ సైకిల్ ని అందించే విధంగా చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. అది చత్తిష్ గడ్ రాష్ట్ర(Chhattisgarh State)ము బిజాపూర్ జిల్లా పమెడ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దామారం గ్రామం. ఆ ఊరికి చెందిన 16 యేండ్ల కుర్రాడు మడకం లక్మా, పుట్టుక తోనే వికలాంగుడు. రెండు కాళ్ళు పడిపోయాయి. చేతులను మాత్రం కాస్త కదుపుతాడు. తాను గ్రామం లో తిరిగేందుకు సొంత గా కర్రలకు సైకిల్ చెక్రాలు అమర్చి చిన్న వాహనం తయారు చేసుకున్నాడు. దాని ద్వారా అడవులు, ఇతర గ్రామాలకు వెళ్తున్నాడు. ఇదే క్రమంలో నరక యాతన అనుభవిస్తున్నాడు.
యూట్యూబ్ వీడియో..
శనివారం కొండపల్లి జరిగే వారపు సంతకు యువకుడు లక్మ వొచ్చాడు. ఇదే క్రమంలో యువకుడు కర్రల పై వెళ్తున్న వీడియో జంగిల్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్(Times YouTube Channel) చిత్రకరించారు. ఆపై యువకుడికి సాయం చేసారూ.. 24 గంటల్లో 25 లక్షల వ్యూస్ వీడియో జంగల్ టైమ్స్ యూట్యూబ్, ఇంస్ట్రా గ్రామ్ లో అప్ లోడ్ చేసిన వెంటనే లక్షల్లో వ్యూస్ వొచ్చాయి. సుమారు 4200 మంది కామెట్ చేసారు. 9200 వీడియోని షేర్ చేశారు. చత్తిస్‌గడ్(Chhattisgarh), తెలంగాణ(Telangana) రాష్టాల్లో వీడియో వైరల్ అయ్యింది.
Also Read: Home Remedies: చలికాలంలో జలుబు దగ్గు రాకుండా ఉండాలంటే ఈ పానీయాలు తాగండి!
స్పందించి మాజీ మంత్రి
ఈ వీడియో చుసిన చేత్తిస్‌గడ్ మాజీ అటవీ శాఖ మంత్రి మహేష్ గగడా(Mahesh Gagada), రాయిపూర్ నుండి సోమవారం పామెడ్ గ్రామానికి వొచ్చారు. యువకుడి కి బ్యాటరీ బండిని అందించారు. యువకుడికి పింఛన్ అందిస్తా అని తెలిపారు. దీంతో యువకుడు ఆనందం వ్యక్తం చేసాడు. కాగా యువకుడి కోసం రాయి పూర్ నుండి వొచ్చిన మాజీ మంత్రిని పలువురు అభినందించారు. జంగిల్ టైమ్స్ యూట్యూబ్ వారికీ మాజీ మంత్రి ప్రత్యేక ధన్యవాదములు చెప్పారు.
Also Read: Delhi Red Fort Blast: ఢిల్లీ బాంబు పేలుళ్లపై సినీ తారల సంతాపం
