Treatment Rates (imagecredit:twitter)
తెలంగాణ

Treatment Rates: ప్రైవేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై సర్కారు స్క్రీనింగ్.. ట్రీట్మెంట్ రేట్లన్నీ ఒకేలా ఉండేలా ప్లాన్!

Treatment Rates: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ దవాఖాన్లలోని చికిత్స రేట్లన్నీ ఒకే ప్లాట్ ఫామ్ లోకి తీసుకువచ్చేందుకు సర్కార్ ప్రయత్నిస్తుంది. సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్స్ లో టరిఫ్​ లను బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనతో ఉన్నది. బేసిక్ చికిత్స ప్రోసీజర్లకు ఫిక్స్‌డ్ రేట్లు పెట్టాలని భావిస్తున్నది. అయితే ఈ రేట్లకు సర్వీస్ లోని క్వాలిటీ, డాక్టర్స్ అనుభవం, సౌకర్యాలు, వంటి వాటిని అదనంగా యాడ్ చేసుకునేందుకు వెలుసుబాటు కల్పించాలని ప్లాన్ చేస్తుంది. స్టాండర్డ్ రేట్లు ఉండేలా ప్రణాళికను తయారు చేయనున్నారు. అయితే ఈ రేట్లు ఎలా ఉంటే బెటర్..? ఏయే హాస్పిటల్స్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బేసిక్ ట్రీట్మెంట్ ఫీజు ఒకేలా ఉంటే నష్టమేమిటీ? వంటి అంశాలపై ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి కూడా సర్కార్ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ఫ్యాకేజీ ధరలే ఫిక్స్ చేయాలని ప్రైవేట్ ఆసుపత్రులను సర్కార్ కోరగా, ఆ రేట్లకు నార్మల్ మోడ్ లో పేషెంట్లకు వైద్యసేవలు అందించలేమని ప్రైవేట్ ఆసుపత్రులు టీమ్ చెబుతున్నట్లు సమాచారం.

క్లినికల్ ఎస్టాబ్లిష్​ మెంట్ యాక్ట్..

అయితే దీనిపై సర్కార్ అధ్యయనం చేస్తుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్​ మెంట్ యాక్ట్ మీటింగ్(Clinical Establishment Act Meeting) సోమవారం హెల్త్ సెక్రటరీ అధ్యక్షతన జరిగింది. ఈ మీటింగ్ కు డీఎంఈ, డీహెచ్ తో పాటు పలువురు మెంబర్లు పాల్గొన్నారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ప్రత్యేకంగా హాజరయ్యారు. రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్​ మెంట్ యాక్ట్(Clinical Establishment Act) అమలు, ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు అనుసరిస్తున్న విధానాలు, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ మీటింగ్ లో క్లినికల్ ఎస్టాబ్లిష్​ మెంట్ యాక్ట్ గురించి డీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్(Ravinder Naik) వివరించగా, ఐసీయూ(ICU), స్పెషాలిటీ సేవలు, మోర్టాలిటీ రేట్ వంటి వాటిపై డీఎంఈ డిస్కషన్ చేశారు. బయో మెడికల్(Bio Medical), ఫైర్ సేప్టీ(Fire Safety)పై, రిజిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్​ మెంట్ అనుమతులు వంటి వాటిపై కమిటీ పూర్తి స్థాయిలో చర్చించింది. నెక్ట్స్ మీటింగ్ లో ఈ అంశాలపై ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఓ ఆఫీసర్ వివరించారు.

Also Read: Telangana Tourism: మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం

ఎవరికి ఎప్పుడు ఏం చేయాలి?

క్లినికల్ ఎస్టాబ్లిష్​ మెంట్ యాక్ట్ ప్రకారం అన్ని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పేషెంట్ బేసిక్ కేర్ ఏమిటీ? ఎవరిని అడ్మిట్ చేయాలి? ఐసీయూ ఎవరికి అవసరం? హై డీపెన్ డెన్సీ యూనిట్ లో ఎవరిని చేర్చాలి? జనరల్ వార్డులో ఎవరిని పంపాలి? ఎప్పుడు డిచ్చార్జ్ చేయాలి? వంటి మార్గదర్శకాలు స్పష్టంగా అమలు చేయాలి. కానీ మెజార్టీ ప్రైవేట్ ఆసుపత్రులు ఈ రూల్సేవీ పాటించవు. అర్బన్, రూరల్ హాస్పిటల్స్ లో అమలు చేయాల్సిన విధి, విధానాలు కూడా స్పష్టంగా ఉంటాయి. కానీ సరైన దిశగా అమలు కావు. ప్రధానంగా పేషెంట్ల నుంచి భారీగా బిల్లులు వసూల్ చేసేందుకే ఎక్కువ హాస్పిటల్స్ ప్రాధాన్యత చూపుతాయి. దీంతోనే యూనిఫామ్ రేట్ల సిస్టమ్ ను అమలు చేయాలని ప్రభుత్వం సూత్రపాయంగా ఆలోచిస్తున్నది.

చిన్న క్లినిక్ లకు రిలాక్సేషన్.?

క్లినికల్ ఎస్టాబ్లిష్​ మెంట్ యాక్ట్ ను స్ట్రిక్ట్ గా అమలు చేయాలని భావిస్తున్న సర్కార్…చిన్న క్లినిక్ లకు రూల్స్ నుంచి కాస్త రిలాక్సేషన్ ఇవ్వాలనీ భావిస్తున్నట్లు తెలిసింది. హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకు 20 బెడ్లు లోపు ఉన్న దవాఖాన్లను ఈ యాక్ట్ నుంచి సవరించాలని సర్కార్ అధ్యయనం చేస్తుంది. అంతేగాక రూరల్ ప్రాంతాల్లోని క్లినిక్ లను రిలాక్సేషన్ లోకి తీసుకురావాలి భావిస్తున్నారు. ఇప్పటికే బీహార్ లో 40 బెడ్లు లోపు హాస్పిటల్స్ కు క్లినికల్ ఎస్టాబ్లిష్​ మెంట్ యాక్ట్ ను అమలు చేయడం లేదు. హర్యానాలో 50 బెడ్లు, పంజాబ్ లో 50 బెడ్లు, ఏపీలో 50 బెడ్ల లోపు హాస్పిటల్స్ , క్లినిక్ లను ఈ యాక్ట్ నుంచి సవరించారు. దీంతో తెలంగాణలోనూ 20 బెడ్ల హాస్పిటల్స్ ను ఈ రూల్ నుంచి తొలగించాలని హెచ్ ఆర్ డీఏ కోరింది. దీంతో పాటు సింగల్ విండ్ మోడ్ లో రిజిస్ట్రేషన్ అమలు చేస్తూ 3 నుంచి 5 ఏళ్లకు ఓ సారి రెన్యువల్ విధానాన్ని తీసుకురావాలని హెచ్ ఆర్ డీఏ ప్రతినిధులు కోరారు. ఇక ఆర్ ఎంపీ, పీఎంపీ, ఫేక్ డాక్టర్ల వ్యవస్థపై స్ట్రిక్ట్ గా ఉండాల్సిందేనని మెడికల్ కౌన్సిల్ ఈ మీటింగ్ లో గట్టిగానే ప్రస్తావించినట్లు తెలిసింది.

Also Read: Cyber Security: తెలియని లింక్‌ల నుంచి APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

Just In

01

Gold Missing Crime: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ప్రగతి ఆసుపత్రిలో మహిళ డెడ్ బాడీ నుంచి బంగారం మాయం

Delhi Car Blast: ఎవ్వరినీ వదిలిపెట్టం.. తగిన శాస్తి చేస్తాం.. ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Dharmendra Health Update: బతికి ఉండగానే చంపేస్తారా? మీడియాపై ధర్మేంద్ర కుమార్తె ఇషా, భార్య హేమామాలిని ఫైర్

National Education Day 2025: నేషనల్ ఎడ్యుకేషన్ డే.. మన దేశంలో ఈ రోజు ఎందుకు అంత ముఖ్యమో తెలుసా?

Gujarat Ricin Plot: ప్రసాదాలు, తాగునీటిలో విషం.. వందలాది మంది హత్యకు కుట్ర.. హైదరాబాది ఉగ్రవాది ప్లాన్