Mana Shankara Vara Prasad Garu (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Mana Shankara Vara Prasad Garu: ఐటమ్ సాంగ్‌ చేస్తున్నది ఎవరో తెలుసా? ఇందులోనూ అనిల్ మార్కే!

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమాపై అంచనాలు ఏవిధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్‌లు, ముఖ్యంగా ‘మీసాల పిల్ల’ (Meesala Pilla) పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఎనర్జిటిక్ సాంగ్ 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ను క్రాస్ చేసి, ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ సినిమాకు భారీ హైప్‌ను తీసుకొచ్చింది. మెగా అభిమానులతో పాటు సంగీత ప్రియులను కూడా ఈ పాట ఊపేస్తోంది. ఈ అంచనాలను మరింత పెంచేలా.. తాజాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ఉండబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పాట విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన ‘మార్క్‌’ను ప్రదర్శించారని టాక్ నడుస్తోంది. గతంలో తన సినిమాలలో అదిరిపోయే స్పెషల్ నంబర్లను ప్లాన్ చేసే అనిల్, ఈసారి ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్నా (Milky Beauty Tamannaah)ను రంగంలోకి దింపనున్నారనేది తాజా సమాచారం.

Also Read- Bharani Bonding: బిగ్ బాస్ హౌస్‌లో భరణి బాండింగ్ బద్దలైంది.. ఈ వారం ఎవరిని నామినేట్ చేశాడో తెలుసా?

అనిల్ కోరిక మేరకేనా?

ఐటెమ్ సాంగ్స్‌తో ఇటీవల విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తమన్నా.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనుందనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అనిల్ రావిపూడి గత చిత్రాలైన ‘సరిలేరు నీకెవ్వరు’లో తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవగా.. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి చిత్రాలలో ఆమె మెయిన్ హీరోయిన్‌గా నటించింది. ఆ పరిచయంతోనే అనిల్ కోరిక మేరకు తమన్నా ఈ ప్రత్యేక గీతంలో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ‘సైరా’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాలలో చిరు సరసన తమన్నా నటించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ఎనర్జీ, తమన్నా గ్లామర్, అనిల్ మార్క్ కమర్షియల్ హుక్ కలిస్తే ఈ పాట థియేటర్లలో రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా, ఈ స్పెషల్ సాంగ్‌లో విక్టరీ వెంకటేష్ కూడా అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉందని, ఇది ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్ కానుందనేలా రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read- RT76: భర్త మహాశయులకు ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

ఇప్పటికే విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, ఈ ముగ్గురు స్టార్ల కలయిక ఈ పాటకు మరింత క్రేజ్‌ను తీసుకొస్తుందనడంలో సందేహమే లేదు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి 2026 కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తమన్నా ఐటెం సాంగ్ విషయంలో చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే సెకండ్ సింగిల్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Prasanth Varma: ‘జై హనుమాన్’ డౌటేనా? ప్రశాంత్ వర్మ ఇలా ఇరుక్కున్నాడేంటి?

Delhi Blast: ఢిల్లీ సమీపంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టివేత!

Delhi Explosion: దిల్లీ బ్లాస్ట్‌పై సీపీ స్పందనిదే.. దర్యాప్తుకు ఆదేశించిన హోం మినిస్టర్

Hyderabad Alert: ఢిల్లీ కారు బాంబు పేలుడు నేపథ్యంలో.. హైదరాబాద్ లో హై అలర్ట్

Ande Sri: అందెశ్రీ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం