Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 64వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 64) సోమవారం. శని, ఆది వారాలు కింగ్ నాగార్జున (King Nagarjuna) ఎంట్రీతో ఎంత హుషారుగా హౌస్ ఉంటుందో.. మండే (Monday) వచ్చే సరికి మాత్రం హౌస్‌లో మంటలు మొదలవుతాయి. కారణం నామినేషన్స్ (Bigg Boss Nominations). ఈ వారం మొత్తం, ఇంకా అంతకు ముందు జరిగిన వారాలలో తమను ఎవరు ఇబ్బంది పెట్టారో, తమకు ఈ గేమ్‌లో పోటీగా ఉందెవరో వారిని నామినేట్ చేసేందుకు.. ఒక్కొక్కరు ఫైర్ మీద ఉంటారు. 10వ వారానికి సంబంధించి సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్ చాలా వెరైటీగా ప్లాన్ చేశారు. ‘ఈ వారం నామినేషన్స్ మీ అంచనాలను తలకిందులు చేస్తుంది. ఇది చేయడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. నామినేట్ చేయాలనుకున్న ఒకరిని.. బలమైన మీ కారణాలతో నామినేట్ చేసి, అక్కడున్న షవర్ కింద కూర్చోబెట్టాలి’ అని బిగ్ బాస్ సూచించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రోమోలో ఇదంతా చూపించారు. భరణి, దివ్య, సంజన, నిఖిల్ వంటివారు నామినేట్ అవడంతో పాటు.. దివ్య, రీతూల మధ్య రచ్చ నడిచినట్లుగా మొదటి ప్రోమోలో చూపించారు. తాజాగా రెండో ప్రోమో వచ్చింది. ఈ ప్రోమోని గమనిస్తే..
Also Read- RT76: భర్త మహాశయులకు ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!
నాకది నచ్చలేదు
‘గౌరవ్ మొన్న కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వొకరిని సపోర్ట్ చేస్తున్నావు. ఆ పర్సన్ ఫస్ట్ రౌండ్‌లో అవుటైతే.. ఇంక నా పని అయిపోయిందని పోయి పక్కన కూర్చున్నావు. నాకది నచ్చలేదు’ అని దివ్య అంటే.. ‘నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థం కాలేదు. ఒకరికి సపోర్ట్ చేయడానికి వచ్చావ్, వాళ్లు గేమ్ నుంచి అవుట్ అవగానే, ఎవరికీ సపోర్ట్ చేయను అన్నట్లుగా, నాకు ఏం సంబంధం లేదు అన్నట్లుగానే తిరుగుతున్నావు’ అని తనూజ తన వివరణ ఇస్తుంది. ‘ఫుడ్‌లో నీ పోర్షన్ అడగడంలో ఎలా అయితే ఫస్ట్ ఉంటావో.. గేమ్ అర్థం చేసుకోవడంలో నువ్వు ఫస్ట్ ఉండవ్’’ అని దివ్య (Divya) అంటే.. ‘‘నీకు అవసరం ఉన్నప్పుడు సూపర్ స్వింగ్‌లా ఉంటావు, నీకు అవసరం తీరిపోగానే.. హా, ఏంటి? ఏది? అని నీ బాడీ లాంగ్వెజ్ కూడా పూర్తిగా మారిపోతుంది’’ అని తనూజ (Tanuja) అంది. ఇద్దరూ గౌరవ్‌కు క్లాస్ మీద క్లాస్‌లు ఇస్తున్నారు.
Also Read- Dhandoraa: బిందు మాధవి వేశ్యగా నటిస్తున్న మూవీ విడుదల ఎప్పుడంటే?
వావ్ గౌరవ్ సూపర్ అన్నావుగా..
అయితే గౌరవ్ కూడా ఏం తగ్గలేదు. ‘గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఏం చెప్పారు? నీ టైమ్‌లో నువ్వు సపోర్ట్ చెయ్.. నా టైమ్‌లో నేను సపోర్ట్ చేస్తా అన్నారు. నీ లక్ష్యం తనూజని ఎలిమినేట్ చేయడం’ అని దివ్యకు స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు గౌరవ్ (Gaurav). ‘నా ఫస్ట్ ఆప్షన్ భరణి సార్. తర్వాత వావ్ గౌరవ్ సూపర్ అంటూ నువ్వు ఎందుకు క్లాప్స్ కొట్టావ్. నా నుంచి ఇది ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేశాం’ అని తనూజని ఇబ్బంది పెట్టేశాడు గౌరవ్. ‘గేమ్ కొస్తే.. మీరు గేమ్ ఆడలేదు అన్నా.. మీరు ఖాళీగా ఉన్నారు’ అని సుమన్ శెట్టి (Suman Shetty)తో నిఖిల్ వాగ్వివాదానికి దిగాడు. సుమన్ శెట్టి కూడా స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇస్తున్నాడు. ఇద్దరి మధ్య సీరియస్‌గా మాటల యుద్ధం నడస్తుంది. మొత్తంగా చూస్తే.. ఈ సోమవారం ఎపిపోడ్ చాలా ఆసక్తికంగా ఉండటమే కాకుండా.. హౌస్‌మేట్స్ మధ్య కూడా ఆరని మంటలను నెలకొల్పినట్లుగా ఈ ప్రోమో తెలియజేస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
