Bhartha Mahasayulaku Vignyapthi (Image Source: YT)
ఎంటర్‌టైన్మెంట్

RT76: భర్త మహాశయులకు ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

RT76: ‘మాస్ జాతర’ తర్వాత మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) చేస్తున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. సెన్సిబుల్ డైరెక్టర్ కిశోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న సినిమా గురించి ఇప్పటి వరకు వార్తలే కానీ, ఎటువంటి అప్డేట్ రాలేదు. మరోవైపు ఈ సినిమా రాబోయే సంక్రాంతి బరిలో ఉంటుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో.. అసలు ఈ సినిమా ఉందా? లేదా? అనే వరకు అనుమానాలు చేరాయి. ఆ అనుమానాలకు తెరదించుతూ.. తాజాగా మేకర్స్ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. విడుదల చేసిన గ్లింప్స్, సినిమాపై అమాంతం అంచనాలను పెంచేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ టైటిల్ గ్లింప్స్ ఎలా ఉందంటే..

Also Read- Dhandoraa: బిందు మాధవి వేశ్యగా నటిస్తున్న మూవీ విడుదల ఎప్పుడంటే?

ఆశ్చర్యపోయారే తప్ప.. ఆన్సర్ మాత్రం ఇవ్వలే..

ఈ గ్లింప్స్ డైరెక్టర్ కిషోర్ తిరుమల వాయిస్-ఓవర్‌తో కూడిన గుడి ప్రకటనతో ప్రారంభమైంది. ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాల 10 గంటల 30 నిమిషాలకు స్వామివారి కళ్యాణం, కళ్యాణ అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది’ అనే వాయిస్ ఓవర్ డైలాగ్ అనంతరం.. ‘‘ఈ అనౌన్స్‌మెంట్ మనలో చాలా మంది, చాలా సార్లు వినుంటాం. ఇప్పుడు నాకు ఇదెందుకు గుర్తుకు వచ్చిందంటే.. నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడాళ్లు.. నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, జెమిని, చాట్ జీపీటీ.. ఇలా అన్నిటిని అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్నింకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లను, ముఖ్యంగా మొగుళ్లను అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప.. ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మిల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లైన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అని రవితేజ లాంగ్ డైలాగ్ చెప్పారు. (Bhartha Mahasayulaku Wignyapthi Title Glimpse)

Also Read- Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

వారు అడిగిన ప్రశ్నలు ఏంటి?

ఆయన డైలాగ్ చెబుతున్నప్పడు.. స్ర్కీన్‌పై కనిపించే కంటెంట్ మాత్రం.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా? అని అనిపించేలా చేసిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అసలింతకీ వారు అడిగిన ప్రశ్నలు ఏంటనేది మాత్రం ఇందులో చెప్పలేదు. దీనికోసమైనా థియేటర్‌కి వెళ్లాల్సిందే.. అనే ఇంట్రెస్ట్‌ని ఈ టైటిల్ టీజర్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే రవితేజలో కూడా భారీ మార్పు కనిపిస్తుంది. ఎప్పుడూ మాస్ అవతార్‌లో కనిపించే రవితేజ.. ఇందులో చాలా సాఫ్ట్‌గా కనిపిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ మాత్రం అదిరిందనే చెప్పుకోవాలి. సంక్రాంతి రేసులో నిలబడే కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా ఈ గ్లింప్స్ హింట్ ఇచ్చేసింది. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), డింపుల్ హయతి (Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి 2026 (Sankranthi 2026) సందర్భంగా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రబృందం రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో డాన్స్ నంబర్‌ను చిత్రీకరిస్తోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Hanumakonda Collector: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించండి: కలెక్టర్ స్నేహ శబరీష్

Mithra Mandali OTT: థియేటర్లలో మెప్పించలేకపోయింది కానీ.. ఓటీటీలో!

Terrorists Arrest: 12 సూట్ కేసులు.. 20 టైమర్స్.. ఒక రైఫిల్, లేడీ డాక్టర్ ఉగ్ర కుట్ర?

Bigg Boss Telugu 9: హౌస్‌లో ‘మండే’ మంటలు మొదలయ్యాయ్.. ఇంకెవరూ ఆపలేరు!

Swathi murder case: వీడిన స్వాతి మర్డర్ మిస్టరీ.. వెలుగులోకి సంచలన నిజాలు!