Hidma (imagecredit:twitter)
తెలంగాణ

Hidma: కర్రె గుట్టలను చుట్టుముట్టిన బలగాలు.. హిడ్మా కోసం కూంబింగ్

Hidma: మోస్ట్ వాంటెడ్ హిడ్మాను ఖతం చేసేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్‌(Operation Kagar)ను ముమ్మరం చేశాయి. కర్రెగుట్టల్లో భారీగా సాయుధ బలగాలు మోహరించాయి. నలువైపులా చుట్టుముట్టడంతో హిడ్మాను ఎన్‌కౌంటర్(Encounter) చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.

కర్రె గుట్టల్లో హిడ్మా

మావోయిస్ట్ టాప్ కమాండర్ హిడ్మా దళం కర్రె గుట్టల్లో ఉన్నట్టుగా సమచారం ఉన్నది. దాదాపు 200 మంది పీఎల్‌జీఏ(PLGA) బెటాలియన్ సంరక్షణలో అతను ఉన్నట్టు తెలిసింది. కర్రె గుట్టల్లో థర్మల్ సెన్సార్ డ్రోన్ కెమెరా(Thermal sensor drone camera)ల్లో మావోయిస్టుల కదలికలను బలగాలు గుర్తించాయి. ఇప్పటికే 5వేల కేంద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, అదనంగా మరింత మందిని రప్పిస్తున్నారు.

Also Read: Jayakrishna debut movie: హీరోగా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తున్న హిట్ సినిమాల దర్శకుడు..

బేస్ క్యాంపుల ఏర్పాటు

వరుసగా బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ కర్రె గుట్టల్లోకి బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. నూతనంగా మరో మూడు (217, 212, 237) బెటాలియన్లను మోహరించారు. ఛత్తీస్‌గఢ్ వైపు నుండి బేస్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తుండగా, తాజాగా తెలంగాణలోనూ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. భీమారంలో క్యాంప్ పూర్తవ్వగా గొల్లపల్లి బేస్ క్యాంప్ చివరి దశలో ఉన్నది. అదనపు బలగాల మోహరింపుతో భారీ ఎన్‌కౌంటర్ తప్పదని అనుకుంటున్నారు. హిడ్మా బృందం ఇటీవలే కొత్త సభ్యులను నియమించుకుని, కర్రె గుట్టల్లో తమ ప్రభావాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో హిడ్మా టార్గెట్‌గా బలగాలు ముందుకు కదులుతున్నాయి.

Also Read: Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Just In

01

Dhandoraa: బిందు మాధవి వేశ్యగా నటిస్తున్న మూవీ విడుదల ఎప్పుడంటే?

Smart Phone : ఐక్యూఓఓ 15 యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. 5 ఏళ్ల OS అప్‌డేట్‌, 7 ఏళ్ల సెక్యూరిటీ అష్యూరెన్స్ ప్రకటించిన కంపెనీ!

Local Body Elections: స్థానిక సమరంపై గంపెడు ఆశలు.. ఉపఎన్నిక తర్వాతే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌?

Gadwal Sand Mafia: గద్వాల జిల్లాలో దర్జాగా ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

Abhinay Kinger death: ప్రముఖ తమిళ నటుడు అభినయ్ కింగర్ కన్నుమూత.. చివరి క్షణాల్లో సాయం కోసం..