talaivar-173-music(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Thalaivar 173 music: రజనీకాంత్ ‘తలైవార్ 173’ సంగీత దర్శకుడు అతడేనా.. అయితే ఫ్యాన్స్‌కు పండగే..

Thalaivar 173 music: సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ‘తలైవార్ 173’ గురించి సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా యువ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ దాదాపు ఖరారు అయినట్లుగా విశ్వసనీయ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఈ కాంబినేషన్ దాదాపుగా ఖాయమైందనే వార్త రజనీకాంత్ అభిమానుల్లో సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రజనీకాంత్, అనిరుధ్ రవిచంద్రన్ కాంబినేషన్ గతంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించింది. వారిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు వాటిలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు (BGM) ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Read also-Andesri death: ప్రజాకవి అందేశ్రీ మృతిపై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి

‘పెట్టా’ సినిమాలోని పాటలు, ముఖ్యంగా అనిరుధ్ ఇచ్చిన మాస్ బీజీఎం సినిమాకి పెద్ద అదనపు ఆకర్షణగా నిలిచాయి. ‘దర్బార్’ ఈ చిత్రం కూడా మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ‘జైలర్’ ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ‘జైలర్’ చిత్రానికి అనిరుధ్ అందించిన సంగీతం, ముఖ్యంగా ‘హుకుమ్’ పాట తనదైన స్టైల్లో ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఘన విజయం తర్వాత, అనిరుధ్‌కు నిర్మాత నుంచి లగ్జరీ కారుతో పాటు భారీ పారితోషికం లభించింది.

Read also-Tamil Film Producers Council: కోలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఆదాయ భాగస్వామ్య నమూనాను తప్పనిసరి చేసిన టీఎఫ్‌పీసీ.. ఎందుకంటే?

ఈ విజయవంతమైన ట్రాక్ రికార్డు దృష్ట్యా, ‘తలైవార్ 173’ చిత్రానికి కూడా అనిరుధ్‌నే ఎంచుకోవడం సహజంగానే జరుగుతున్న పరిణామంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా అనిరుధ్ తనదైన మార్క్ సంగీతాన్ని అందించి, సినిమా స్థాయిని మరింత పెంచుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ‘తలైవార్ 173’ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ సుందర్.సి దర్శకత్వం వహిస్తారని, ఈ చిత్రంలో కమల్ హాసన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తారని సమాచారం. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ఇద్దరు దిగ్గజాలు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే తెరపై కనిపించనుండడం ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ క్రమంలో, అనిరుధ్ రవిచంద్రన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకోవడం ప్రేక్షకులలో ఉన్న అంచనాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Just In

01

BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ డబ్బులు పంచుతోంది.. ఈసీ పట్టించుకోవట్లేదు.. హరీశ్ రావు ఫైర్

Cyber Security: తెలియని లింక్‌ల నుంచి APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

Thorrur SC Boys Hostel: తొర్రూరు ఎస్సీ హాస్టల్‌లో వసతుల కొరత.. విద్యార్థుల అవస్థలు

OTT censorship in India: ఓటీటీల్లో వల్గారిటీ కంటెంట్ ఉన్నా సెన్సార్ ఎందుకు పట్టించుకోదు?.. రీజన్ ఇదే..