Sreeleela: ఏంటి శ్రీలీల (Sreeleela) సపోర్ట్‌తో ప్రియదర్శి (Priyadarshi), ఆనంది (Anandi) పెళ్లి చేసుకుంటున్నారా? అని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’ (Premante). ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్‌కు ట్రిబ్యూట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ ‘పెళ్లి షురూ’ (Pelli Shuru Song) అనే సాంగ్‌ని శ్రీలీలతో విడుదల చేయించారు.
Also Read- Shiva Re Release: జెన్-జిని మెప్పించే కంటెంట్‌లో ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?
వినగానే అందరూ స్టెప్ వేయాల్సిందే..
ఈ పాట విడుదల చేసిన శ్రీలీల.. పాట చాలా బాగుందని, ఇకపై పెళ్లి మండపాల్లో మోగిపోతుందని చెబుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆనందోత్సాహాలతో నిండిన పెళ్లి సాంగ్ ఇది. హీరో–హీరోయిన్ల వివాహ వేడుకల ఉత్సాహాన్ని, సంబరాన్ని మెలోడీగా లియాన్ జేమ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట వినగానే అందరూ స్టెప్ వేయడానికి ప్రయత్నిస్తారంటే.. ఏ విధంగా సాంగ్‌ని పిక్చరైజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ పాటకు శ్రీమణి రాసిన సాహిత్యం గమనిస్తే.. కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న జంట భావోద్వేగాలను చక్కగా ప్రజెంట్ చేసేలా సాగిందీ పాట. చాలా రోజుల తర్వాత తెలుగు పాటకు శ్రేయా ఘోషాల్ తన మధురమైన వోకల్స్‌ని అందించారు. ఈ పాటకు ఆమె కొత్త అందాన్ని తెచ్చారు. హిందీలో ‘కుబేరా’ సినిమాకు హిట్ పాటలు పాడిన దీపక్ బ్లూ తన ఎనర్జిటిక్ వాయిస్ కలసి ఈ ట్రాక్‌ను మరింత ఆకట్టుకునేలా చేసిందని చెప్పవచ్చు.
Also Read- Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో మూవీ ప్రారంభం.. దర్శకుడెవరంటే?
తెలుగు పెళ్లిళ్లలో మస్ట్ ప్లే సాంగ్
విజువల్‌గానూ ఈ పాట అద్భుతంగా వుంది. వివాహ వాతావరణంలో కాంతులతో, నవ్వులతో, సంతోషంతో నిండి కలర్ పుల్‌గా సాంగ్‌ని చిత్రీకరించారు. చాలా రోజుల తర్వాత పెళ్లిపై చాలా మంచి సాంగ్ వచ్చిందని అంతా అంటున్నారంటే.. ముందు ముందు ఈ పాట ఎలా వినబడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలుగు పెళ్లిళ్లలో మస్ట్ ప్లే సాంగ్‌గా ఈ పాట మారబోతోంది. ప్రియదర్శి, ఆనంది ఇద్దరూ బ్యూటీఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటకు జీవం పోశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకోగా, ఇప్పుడొచ్చిన ‘పెళ్లి షురు’ పాట సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు ‘గామి’ సినిమాకు గానూ గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి డీవోపీగా పనిచేస్తున్నారు. ఎడిటింగ్‌ను రాఘవేంద్ర తిరున్ పర్యవేక్షిస్తారు.
Sooo Happy to launch #PelliShuru song from #Premante 💖
Looking like THE wedding song of the year already!! https://t.co/topg63sPbmSending lots of love to the entire team! 🫶 #PremanteOnNov21st #ThrilluPraptiRasthu @Preyadarshe @anandhiactress @ItsSumaKanakala… pic.twitter.com/pputoIfVVx
— Sreeleela (@sreeleela14) November 8, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
