Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 63వ రోజు (Bigg Boss Telugu 9 Day 63) ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్‌తో హోస్ట్ నాగార్జున (King Nagarjuna) షోని మొదలు పెట్టారు. సండే ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమోస్ వదిలారు. ఈ ప్రోమోస్ చూస్తుంటే ఈ సండే బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్, ఎలిమినేషన్స్ అన్నీ ఉన్నట్లుగా అర్థమవుతోంది. శనివారం ఎపిసోడ్‌లో సడెన్‌గా రాము రాథోడ్ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుగు కానీ, సడెన్‌గా రాము తన ఫ్యామిలీ గుర్తుకు వస్తుందని, హౌస్‌లో ఉండలేకపోతున్నానని చెప్పి.. బయటకు వచ్చేశాడు. నిజంగా ఇది షాకే. కాకపోతే రెండు వారాలుగా అతను చాలా దిగులుగా ఉంటూ, టాస్క్‌లలో, బిగ్ బాస్ ఇంట్లో కూడా సరిగా ఉండటం లేదు. అందుకే, నాగార్జున కూడా ముందు ధైర్యం చెప్పినా, తర్వాత అతని ఇబ్బందిని గమనించి.. డోర్స్ తెరిచారు. ఇంక సండే ఎపిసోడ్‌కు సంబంధించి వచ్చిన ప్రోమోస్ విషయానికి వస్తే..
Also Read- Bellamkonda Suresh: ఇల్లు కబ్జా.. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు
ట్రోఫీకి దగ్గరగా ఎవరు? ఎగ్జిట్‌కు దగ్గరగా ఎవరు?
ఒక డ్యాన్స్ క్లిప్‌ని చూపించి.. దానికి సంబంధించి ఓ ప్రశ్నను నాగార్జున అడుగుతున్నారు. హౌస్‌లోని వారు రెండు టీమ్‌లో విడిపోయి, పాటకు సంబంధించిన ప్రశ్న అడగగానే బెల్ కొట్టి సమాధానం చెబుతున్నారు. ఇందులో డిమోన్ పవన్, రీతూ, కళ్యాణ్ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పి.. యునానిమస్‌గా గెలిచేశారు. ఈ ప్రోమో అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేయగా, రెండో ప్రోమోలో మాత్రం ఆసక్తికరమైన టాస్క్ నడిచింది. ‘ఈ హౌస్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌లో ట్రోఫీకి దగ్గరగా ఎవరు వెళుతున్నారు? ఎగ్జిట్‌కు దగ్గరగా ఎవరెళుతున్నారు?’ అని కింగ్ నాగార్జున ఒక్కో హౌస్‌మేట్‌ని పిలిచి అడిగారు. ఎక్కువ మంది ఇమ్మానుయేల్ ఫొటోని ట్రోఫీకి దగ్గరగా పెట్టారు. భరణి, సాయిని ఎగ్జిట్‌కు దగ్గరగా పెట్టారు. తనూజ, డిమోన్ పవన్‌లు కూడా ట్రోఫీకి దగ్గరగా ఉన్నట్లుగా హౌస్‌మేట్స్ చెప్పుకొచ్చారు. ఈ ప్రోమోలో ‘ఎందుకు చిన్న చిన్న విషయాలను ఇరిటేట్ అయిపోతున్నావ్’ అని గౌరవ్‌కు నాగార్జున చిన్న క్లాస్ కూడా ఇచ్చారు. ఫుడ్ విషయంలో అలాంటివి చేయవద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read- Mega Heroes: మెగా నామ సంవత్సరం మొదలైనట్టేనా? అంతా మెగా జపమే!
భరణిని ఎందుకు ఎలిమినేట్ చేశారు?
ఫైనల్ కంటెండర్ టాస్క్ దగ్గర నిన్ను మోసం చేశారు కదా.. అప్పుడు నీకు ఎలా అనిపించింది? అని కళ్యాణ్‌ను కింగ్ నాగార్జున అడుగుతున్నారు. ‘తనూజను తీయనని చెప్పి, తీసేసింది కదా.. అని దివ్య విషయంలో బాధ అనిపించింది’ అని కళ్యాణ్ చెప్పగా.. అతని కోసం బిగ్ బాస్ కొన్ని వీడియోలను ప్లే చేశారు. అందులో బిగ్ బాస్ ఇచ్చిన సూచన మేరకే దివ్య అలా ప్రవర్తించిందనేలా ఆ వీడియో తెలియజేసింది. ‘భరణిని ఎందుకు ఎలిమినేట్ చేశారు? చెప్పేటప్పుడు? అని అడిగా. భరణిని తీయాల్సి వస్తుందనా?’ అంటూ భరణికి చిన్నపాటి క్లాస్ ఇచ్చారు నాగ్. ‘ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ, ఒకరి ఓటమి కోసం ఉండకూడదు’ అని చెప్పిన నాగ్.. చివరిగా ఎలిమినేషన్‌లో ఉన్న సాయి, భరణిలలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేదానికి ఓ ట్రైన్ గేమ్ ఏర్పాటు చేశారు. ఎవరి ట్రైన్ టన్నెల్‌లో ఆగిపోతే వారు ఎలిమినేటెడ్? అని నాగ్ సూచించారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చూపించలేదు కానీ, ‘తనూజా.. నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది.. ఆ బజర్ వాడతావా? లేదా? ఆలోచించు’? అని బాల్‌ని తనూజ కోర్టులోకి విసిరారు. మొత్తంగా అయితే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్‌పై మంచి ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేశారు. చూద్దాం మరి.. ఈ వారం ఎవరు ఎలిమినేటై బయటకు వస్తారో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
