maganti-Family (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Maganti Legacy Row: జూబ్లీహిల్స్ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మాగంటి గోపినాథ్ తల్లి, కొడుకు సంచలన వ్యాఖ్యలు

Maganti Legacy Row: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కు ఒక్కరోజు ముందు జీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపినాథ్ మరణంపై (Maganti Legacy Row) ఆయన తల్లి మహానందకుమారి, మొదటి భార్య మాలిని కొడుకు తారక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపినాథ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. గోపినాథ్ జూన్ 6న చనిపోయారా?, లేక 8న మృతి చెందారా? అన్నది మిస్టరీగా అనిపిస్తోందని మహానంద కుమారి సందేహం వ్యక్తం చేశారు. గోపినాథ్ ఎప్పుడు మృతి చెందారన్నది ఒక తల్లిగా తనకే తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాతే మరణవార్తను ప్రకటించారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. గోపీనాథ్‌ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంచి పేరు తెచ్చుకున్నారని, కానీ, ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కనీసం ఒక్క అటెండర్‌ను కూడా పెట్టలేదని ఆరోపించారు. గోపినాథ్‌ను చూడడానికి ఒక్క రోజు కూడా సమయం ఇవ్వలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్‌‌మీట్‌లో మాగంటి గోపినాథ్ మొదటి భార్య మాలినితో పాటు ఆమె కొడుకు తారక్ కూడా పాల్గొన్నాడు.

నా కొడుకు మాలినికి విడాకులు ఇవ్వలేదు

‘‘నా కొడుకు (మాగంటి) మొదటి భార్య మాలినికి డైవర్స్ ఇవ్వలేదు. ఇవిగో ప్రూఫ్స్’’ అని మహానందకుమారి మీడియాతో అన్నారు. చనిపోయాక వచ్చారని తమను అంటున్నారని, గోపినాథ్ బతికి లేడు కాబట్టి గుర్తింపు కోసం తమ పోరాటమని ఆమె చెప్పారు. గుర్తింపు వచ్చేవరకు పోరాడతామన్నారు. ఐడెండిటీ లేకుండా ఈ బిడ్డ (తారక్) ఎలా బతుకుతాడని ఆమె ప్రశ్నించారు. ‘‘మాగంటి తన భర్త అని నీకు నవ్వు ప్రకటించేసుకుంటే సరిపోతుందా?. ఏదైందీ గవర్నమెంట్ చెబుతుంది. అది మానేసి. వాళ్లకు దగ్గర ఏమీ లేవు. వాళ్లు ఉట్టిదే అంటుంటే, నా మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని మనసు బాగా దెబ్బతిన్నది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పటివరకు డైవర్స్ కాలేదు ఇప్పటివరకు. డైవర్స్ కాని పక్షంలో ఆమెకు హక్కు ఉందా లేదా అనేది అందరూ గ్రహించాలి. గోపినాథ్ వద్దనుకుంటే, ఈ ఏళ్లలో విడాకులు తీసుకునేవాడు కాదా?’’ అని మహానందకుమారి ప్రశ్నించారు.

Read Also- Janasena X Account: జనసేన ట్విటర్ అకౌంట్ హ్యాక్!.. ఆదివారం ఉదయం ఏం పోస్టులు దర్శనమిచ్చాయంటే?

కేటీఆర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు: తారక్

మాలిని కొడుకు తారక్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గ్రాడ్యుయేషన్‌ డేకి రావాలని తన తండ్రి గోపినాథ్ అనుకున్నారని, కానీ, హఠాత్తుగా చనిపోయారని ప్రస్తావించారు. తారక్ అంటే ఎవరో తెలియదన్న సునీత, జూన్ 6న తనకు ఫోన్ చేశారని, ఎవరో తెలియకపోతే ఎందుకు కాల్ చేశారని ఆయన ప్రశ్నించారు. తనను ఇండియాకు రావొద్దని సునీత చెప్పారని, రెజ్యూమ్ పంపిస్తే కేటీఆర్ అంకుల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పినట్టు మీడియాకు తెలిపారు. గోపినాథ్ మరణంతో చట్టపరంగా తమకు ఎలాంటి గుర్తింపు లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. తాను అమెరికా నుంచి ఇక్కడి రాకుండా ఈ ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు.

Read Also- CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి

పువ్వాడ అజయ్ బెదిరించారు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌ కుమార్‌తో పాటు కొందరు సంఘ విద్రోహక వ్యక్తులు కలిసి గోపినాథ్ అంత్యక్రియలకు తాను హాజరుకాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారసత్వం విషయంలో చట్టపరంగా తన నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపినాథ్ అంత్యక్రియలకు తనను రానివ్వకపోవడమే కాకుండా, నానమ్మ, పెద్దనాన్నలపై నిందలు వేస్తున్నారని, వాళ్లతో మాట్లాడొద్దంటూ తనకు నూరిపోసేవారని వివరించారు.

Just In

01

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

AR Rahman Concert: ఏఆర్‌ రెహమాన్‌ కాన్సర్ట్‌‌లో ‘పెద్ది’ టీమ్.. ‘చికిరి చికిరి’కి సౌండ్ అదిరింది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్తూరు పర్యటనలో అపశృతి.. మహిళ కాలిపైకి కారు!

Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో మూవీ ప్రారంభం.. దర్శకుడెవరంటే?

Donald Trump: టారీఫ్‌లు వ్యతిరేకించేవారు మూర్ఖులు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్