ram-charan-sandeep-reddy(instagram)
Uncategorized, ఎంటర్‌టైన్మెంట్

Sandeep Reddy Vanga: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినోకరు ఫాలో చేసుకుంటున్న సందీప్ రెడ్డి, రామ్ చరణ్.. ఇది దేనికి సంకేతం?

Sandeep Reddy Vanga: డైనమిక్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇన్‌స్టాగ్రామ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ కూడా సందీప్ రెడ్డి వంగా ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఇలా ఫాలో అవడంపై సినీ వర్గాల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. వీరిద్దరూ కలిసి సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని రూమర్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరు అగ్రశ్రేణి ప్రతిభావంతులు ఇలా కనెక్ట్ అవ్వడం వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఉండి ఉంటుందని సినీ ప్రేమికులు బలంగా నమ్ముతున్నారు. అయితే దీని గురించి ఇప్పటివరకూ అధికారిక సమాచారం రాలేదు. అయినా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే గ్లోబల్ స్థాయిలో హిట్ అవుతుందని అభిమానులు అసిస్తున్నారు.

Read also-The RajaSaab: ‘ది రాజాసాబ్’ దర్శకుడిపై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ గురించి గతంలో కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ విడుదలకు ముందు నుంచే వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే చర్చ సినీ వర్గాల్లో ఉంది. రామ్ చరణ్‌కు సన్నిహితుడైన యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థకు వంగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో రామ్ చరణ్ హీరోగా నటిస్తారని కూడా గతంలో పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో వ్యవహారం ఆ పాత పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది. కేవలం సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం అనేది సాధారణ విషయమే అయినా, వీరిద్దరి స్టార్ స్టేటస్ దృష్ట్యా, ఇది వారి తదుపరి సినిమాకు సంకేతం అనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరికీ ప్రస్తుతం ఉన్నప్రాజెక్టులు తర్వాత కలిసి చేసి సినామాను గ్లోబల్ హిట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ విషయం గురించి ఏం జరుగుతుంతో వేచి చూడాల్నిందే.

Read also-Diwali movies on OTT: ఓటీటీకి క్యూ కడుతున్న దీపావళి సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత, ఆయన బ్లాక్‌బస్టర్ సినిమా ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ పనులను మొదలుపెట్టనున్నారు. మరోవైపు, రామ్ చరణ్ సైతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా తరువాత, ఆయన సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ బిజీ షెడ్యూల్స్ కారణంగా వీరి కాంబినేషన్‌లో సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లడం కష్టమే అయినా, అభిమానులు మాత్రం నిరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా, వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో మొదలైన ఈ “స్నేహం” త్వరలోనే ఒక అధికారిక ప్రకటనగా మారి, ప్రేక్షకులకు ఒక సంచలనాత్మక చిత్రాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

Just In

01

Honda Elevate 2025: హోండా నుంచి కొత్త సర్ప్రైజ్.. ఎలివేట్ ADV ఎడిషన్ లాంచ్

Election Betting: జూబ్లీహిల్స్ బైపోల్‌పై వందల కోట్లలో పందాలు

Janasena X Account: జనసేన ట్విటర్ అకౌంట్ హ్యాక్!.. ఆదివారం ఉదయం ఏం పోస్టులు దర్శనమిచ్చాయంటే?

Singareni Collieries: భవిష్యత్తులో కీలక ఖనిజాల తవ్వకాలు ఉంటే భాగస్వాములవుతాం

Jubilee Hills By Election: ప్రచారంలో వెనుకంజ.. చివరి రోజైనా సీరియస్‌గా తీసుకుంటారా..?