king-nagarjuna(X)
ఎంటర్‌టైన్మెంట్

Richest actors: సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా.. వారి ఆస్తులు ఎంతంటే?

Richest actors: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ (సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ) ప్రస్తుతం ప్రపంచ సినీపటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఈ విజయం కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, అందులోని అగ్ర నటుల ఆర్థిక స్థోమతను కూడా అమాంతం పెంచింది. తమ నటన, బ్రాండ్ విలువ, తెలివైన వ్యాపార పెట్టుబడుల ద్వారా సౌత్ ఇండియాలో అత్యంత సంపదను కూడబెట్టిన ఐదుగురు అగ్ర నటుల వివరాలు వారి ఆస్తుల విశ్లేషణ ఇక్కడ చూద్దాం.

1. అక్కినేని నాగార్జున
నికర ఆస్తి అంచనా: రూ.3,572 కోట్లు

నాగార్జున సంపాదనలో సినీ పారితోషికం ఒక భాగం మాత్రమే. ఆయన ఆస్తిలో ప్రధాన భాగం అన్నపూర్ణ స్టూడియోస్ వంటి కుటుంబ యాజమాన్య సంస్థలు, రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాల ద్వారా వస్తుంది. ఆయన నిర్మాణ రంగంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో క్రీడా లీగ్‌లలో కూడా పెట్టుబడులు పెట్టారు. తెలుగులో అత్యంత ధనవంతులైన నటులలో ఈయన మొదటి స్థానంలో ఉన్నారు.

Read also-Jana Nayagan: ‘జన నాయగన్’ కచేరి లిరికల్ వచ్చేసింది.. ‘భగవంత్ కేసరి’ సాంగ్ దించేశారుగా!

2. చిరంజీవి
నికర ఆస్తి అంచనా: రూ.1,650 కోట్లు

‘మెగాస్టార్’ చిరంజీవి సుమారు 150కి పైగా సినిమాలలో నటించి, దశాబ్దాల పాటు అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఉన్నారు. సినిమాలతో పాటు, ఆయనకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విశాలమైన ఇల్లు, బెంగుళూరు సమీపంలో ఫామ్‌హౌస్‌లు వంటి అనేక ఖరీదైన రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. లగ్జరీ కార్లు ప్రైవేట్ జెట్ వంటి ఆస్తులు కూడా ఆయన సంపదను పెంచాయి.

3. రామ్ చరణ్
నికర ఆస్తి అంచనా: రూ.1,370 కోట్లు

రామ్ చరణ్ సంపద కేవలం సినిమా పారితోషికం నుండే కాక, ఆయన కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్ వంటి వ్యాపార సంస్థలలోని వాటాల ద్వారా కూడా వస్తుంది. గతంలో ‘ట్రూజెట్’ విమానయాన సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్‌ల తరువాత, ఆయన పారితోషికం గణనీయంగా పెరిగింది. ఆయన ‘కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ’ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు.

Read also-Mega Heroes: మెగా నామ సంవత్సరం మొదలైనట్టేనా? అంతా మెగా జపమే!

4. రజనీకాంత్
నికర ఆస్తి అంచనా: రూ.470 కోట్లు

‘సూపర్ స్టార్’ రజనీకాంత్ భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటులలో ఒకరు. ఆయన సినిమా పారితోషికాలు నిర్మాణ సంస్థల నుండి వచ్చే ఆదాయం ప్రధాన సంపద వనరులు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, ఆయన రియల్ ఎస్టేట్ మరియు ఇతర పెట్టుబడుల ద్వారా కూడా సంపాదిస్తారు. ఆయనకు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన ఇల్లు మరియు బహుళ ఆస్తులు ఉన్నాయి.

5. అల్లు అర్జున్
నికర ఆస్తి అంచనా: రూ.460 కోట్లు

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నికర ఆస్తిలో పెరుగుదలకు ‘పుష్ప’ వంటి పాన్-ఇండియా విజయాలు దోహదపడ్డాయి. ఆయన సినిమా పారితోషికంతో పాటు, అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. ఆయనకు AAA సినిమాస్ నిర్మాణ సంస్థలలో భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్ మరియు హాస్పిటాలిటీ రంగంలో పెట్టుబడులు కూడా ఉన్నాయి, ఇవి ఆయన సంపదను పటిష్టం చేశాయి.

Just In

01

Sharwanand fitness journey: తన ఫిట్‌నెస్ రహస్యం ఏంటో చెప్పిన హీరో శర్వానంద్.. మార్పుకు కారణం అదే..

Jayakrishna debut movie: హీరోగా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తున్న హిట్ సినిమాల దర్శకుడు..

Chikiri song: గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్..

Hyundai Venue 2025: హ్యుందాయ్ వెన్యూ 2025 ఎంట్రీతో SUV మార్కెట్లో రగడ.. టాటా, మారుతి, కియా, మహీంద్రాకి గట్టి పోటీ ఇస్తుందా?

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి