Businessman Re Release (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Businessman Re Release: పోయించడానికి మళ్లీ సారొస్తున్నారు!

Businessman Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. వారికి సెలబ్రేషన్ టైమ్ మొదలైంది. రాజమౌళి (SS Rajamouli)తో చేస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమా వచ్చే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు మహేష్ బాబు సినిమా లేదంటే ఫ్యాన్స్‌‌‌ డీలా పడిపోతారు. అందులోనూ రాజమౌళి అప్డేట్స్ కూడా అంత తొందరగా వదలరు కాబట్టి.. ఇప్పుడు ఫ్యాన్స్‌కు ఉన్న ఒకే ఒక్క దారి ఏంటంటే.. సూపర్ స్టార్ సినిమాలను రీ రిలీజ్ చేసుకోవడమే. ఈ క్రమంలో 2012లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘బిజినెస్‌మ్యాన్’ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్ (SS Thaman) సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆయన అందించిన బీట్స్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. మరీ ముఖ్యంగా ‘సారొస్తారో’ అనే పాటకు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుందంటే.. థమన్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో ‘శివ’ వైబ్.. అమల, ఆర్జీవీ ఎంట్రీతో దద్దరిల్లిన హౌస్!

పవర్‌కి సింబల్‌గా

ఇక ఇందులో మహేష్ బాబు పాత్ర చాలా క్రిటికల్‌గా ఉంటుంది. అసలు ఊహించని విధంగా ఆయన పాత్రను పూరీ మలిచాడు. ‘సూర్య భాయ్’గా మహేష్ బాబు మారే విధానం, మారిన తర్వాత సినిమా నడిచే తీరు.. ఫ్యాన్స్‌కే కాకుండా ప్రేక్షకులకు కూడా ఎంతగానో నచ్చింది. అందుకే ఈ గ్యాప్‌లో ఈ సినిమా అయితే బాగుంటుందని అంతా భావించినట్లు ఉన్నారు. ‘బిజినెస్‌మ్యాన్’ రీ రిలీజ్ డేట్‌ (Businessman Re Release Date)ని తెలియజేస్తూ.. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్‌కు తీసుకువస్తున్న వారు ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో మహేష్ బాబు ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తుండగా.. బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సింహం ‘సూర్య భాయ్’ పవర్‌కి సింబల్‌గా కనిపిస్తోంది. అలాగే, పోస్టర్‌పై ఉన్న ‘Surya Bhai Roar Resurrects – November 29th in Theaters’ అనే లైన్.. ఫ్యాన్స్‌ భారీ ఎగ్జైట్‌మెంట్‌‌కు కారణమవుతోంది.

Also Read- Naga Vamsi: నాగవంశీని 2025 భయపెట్టిందా? అందుకే ‘ఫంకీ’ని 2026కు వాయిదా వేశారా?

మహేష్ మొదటి సినిమా రిలీజ్ డేట్‌కే..

నిర్మాత డా. వెంకట్ ఆధ్వర్యంలోని ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పట్లో నిర్మించింది. అద్భుతమైన టెక్నికల్ స్టాండర్డ్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం మెగా ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రీ రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఆల్ ఓవర్ గ్రాండ్ రీ-రిలీజ్‌కు తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ రీ రిలీజ్ డేట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మొదటి సినిమా ‘నీడా’ (1979) నవంబర్ 29వ తేదీనే విడుదలైంది. అదే డేట్‌కి ‘బిజినెస్‌మ్యాన్’ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని మెగా ప్రొడక్షన్స్ సంస్ధ ప్రకటించింది. ‘ఖలేజా’ రీ-రిలీజ్ విజయంతో హుషారుగా ఉన్న మెగా ప్రొడక్షన్స్ సంస్థ, ఈసారి మరింత విస్తృతంగా స్క్రీన్లు పెంచి, సూర్య భాయ్ గర్జనను దేశమంతా వినిపించడానికి సిద్ధమవుతోంది. ‘బిజినెస్‌మ్యాన్’ కేవలం సినిమా కాదు.. అది ఒక యాటిట్యూడ్. మహేష్ బాబు 46 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్‌గా అభిమానులు జరుపుకునేలా ఈ రీ-రిలీజ్ ఉంటుందని మెగా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Cotton Farmers: జాతీయ రహదారులపై రైతుల ఆందోళన .. భారీగా నిలిచిపోయిన వాహనాలు

DCC Presidents: తుది దశకు చేరిన ఏఐసీసీ కసరత్తు.. ఈ జిల్లాలో డీసీసీ పదవిపై ఉత్కంఠ!

BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?

Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’గా ఎవరో తెలుసా? టీజర్ విడుదల

Heart Attack: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్‌ఎస్ నేత