Snake In Scooty: కరీంనగర్ జిల్లాలో పార్క్ చేసి ఉన్న స్కూటీలో పాము దర్శనమివ్వడం కలకలం రేపింది. స్కూటీ లో పాము ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు స్కూటీ యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో పామును స్కూటీ లో నుండి బయటికి తీయడానికి స్థానికులు నానా తంటాలు పడ్డారు. పాము ఎంతకీ బయటకు రాకపోవడంతో స్కూటీ స్పేర్ పార్ట్స్ తీసేసి బయటకు తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరిపిల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే?
హుజూరాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఓ షాప్ ముందు పార్క్ చేసి ఉన్న స్కూటీలో పాము కనిపించింది. స్కూటీలో పాము వెళ్ళడం గమనించిన స్థానికులు వెంటనే స్కూటీ యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో స్కూటీ వద్దకు వచ్చిన యజమానికి పాము కనిపించలేదు.
స్కూటీ పార్ట్స్ తీసేసి…
స్కూటీ నుంచి పామును బయటకు తీసుకువచ్చేందుకు యజమానితో పాటు స్థానికులు ప్రయత్నించారు. స్కూటీని అటు ఇటు బలంగా కదిపారు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ లోపలే నక్కిన పాము బయటకు రాలేదు. దీంతో చేసేదేం లేక నెమ్మదిగా ఒక్కోస్పేర్ పార్ట్ ను స్థానికులు ఊడదీశారు. చివరకూ పెట్రోల్ ట్యాంక్ కింద ఉన్న చిన్న పాము పిల్లను జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి విడిచిపెట్టారు.
Also Read: UAE Lottery: యూఏఈలో తెలుగోడికి జాక్ పాట్.. రూ.240 కోట్లు సొంతం.. మీరూ గెలవొచ్చు!
ఊపిరిపీల్చుకున్న యజమాని
అయితే స్కూటీలోకి పాము ఎలా వచ్చిందన్న విషయం తనకు తెలియదని యజమాని పేర్కొన్నారు. చుట్టుపక్కల చెట్లు ఉండటంతో అక్కడ నుంచి వచ్చి స్కూటీలో దూరి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. స్థానికులు గుర్తించి చెప్పడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. చూసుకోకుండా స్కూటీని నడిపి ఉంటే కచ్చితంగా చిక్కుల్లో పడేవాడినని ఆందోళన వ్యక్తం చేశారు. పామును సురక్షితంగా బయటకు తీయడంతో తాను ఊపిపీల్చుకున్నాని చెప్పుకొచ్చారు.
