AI Global Summit 2025 (imagecredit:twitter)
తెలంగాణ

AI Global Summit 2025: హైదరాబాద్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్ర చరిత్రలోనే ఓ కొత్త కోర్స్ ప్రారంభం

AI Global Summit 2025: హైదరాబాద్ లో మరో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈనెల 22, 23 తేదీల్లో కామన్ వెల్త్ ఏఐ గ్లోబల్ సమ్మిట్-2025ను నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రభు కుమార్(Dr. Prabhu Kumar) తో కలిసి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి(Balakishta Reddy) తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్ ను ‘ప్రోత్సహించండి-విద్యను అందించండి-సాధికారత కల్పించండి’ అనే థీమ్ తో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్..

దీనికి ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది ప్రతినిధులు, నిపుణులు హాజరవ్వనున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్‌కు కామన్ వెల్త్ దేశాలు, ఇతర ప్రపంచ భాగస్వాములకు ప్రాతినిధ్యం వహిస్తున్న 50 కంటే ఎక్కువ దేశాల నుంచి ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్(సీఎంఏ), రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో, యూకే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సహకారంతో ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్గనైజింగ్ చైర్మన్, కన్వీనర్ డాక్టర్ ప్రభు కుమార్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారిగా రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో ద్వారా కామన్ వెల్త్ ఏఐ, డిజిటల్ హెల్త్ కార్ట్ లో ఫెలోషిప్ సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.

Also Read: Bigg Boss Telugu 9: కెప్టెన్సీ రగడ.. హౌస్‌లోకి రైలు బండి.. సాయి, దివ్యల మధ్య బిగ్ ఫైట్!

ముఖ్య అతిథులుగా..

అనంతరం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ నంద కుమార్ రెడ్డి(Kumar Reddy) మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ ను ఈనెల 22, 23 తేదీల్లో జూబ్లీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revannth Reddy), ఉప మఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 9989220003, 9849137420 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Also Read; Jubliee Hills Bypoll: ప్రచారంలో సీతక్క దూకుడు.. బైక్ ఎక్కి గల్లీల్లో పర్యటన.. కేడర్‌లో ఫుల్ జోష్!

Just In

01

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.1 కోటికి చేరిన బెట్టింగ్‌లు..?

Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో

Bandi Sanjay: గోదావరిఖనిలో ఆలయాల కూల్చివేత.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Wine Shops Closed: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హైదరాబాద్‌‌లో మూడు రోజులు వైన్స్ బంద్..?

Businessman Re Release: పోయించడానికి మళ్లీ సారొస్తున్నారు!