ssmb-29( image :X)
ఎంటర్‌టైన్మెంట్

SSMB29 title glimpse: మూడు నిమిషాల విజువల్ కోసం వంద అడుగుల తెర.. ‘SSMB29’ కోసం ఆమాత్రం ఉంటది..

SSMB29 title glimpse: ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘SSMB29’. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ వేయడానికి రాజమౌళి చేస్తున్న పని చూస్తే అందరూ ఆశ్చర్య పడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 15న గ్రాంట్ ఈ వెంట్ జరగనుంది. అందులో టైటిల్ గ్లింప్ వేయనున్నారు. ఈ టైటిల్ గ్లింప్స్ వేయడానికి రామోజీ ఫిల్మి సిటీలో భారీ తెర ఏర్పాటు చేస్తున్నారట. వంద అడుగులు ఎత్తు, నూట ముప్పై అడుగుల వెడల్పు కలిగిన భారీ తెర ఏర్పాటు చేస్తున్నారు. మూడు నిమిషాల విజువల్ కోసం వంద అడుగుల తెరవేయడం ఈ సినిమా గొప్పతనాన్ని తెలియజేస్తుంది. దీనిని చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం టైటిల్ గ్లింప్స్ కోసం ఈ రేంజ్ ఏర్పాట్లు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. కేవలం టైటిల్ కోసమే ఇంత ఖర్చు పెడితే ఇక సినిమా కోసం ఏ రేంజ్ లో ఖర్చు అవుతుందో దీనిని చూస్తేనే తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read also-Chikiri song record: బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్.. ఇండియాలో ఇదే ఫస్ట్ సాంగ్

భారతీయ సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ‘SSMB29’ (వర్కింగ్ టైటిల్). ఈ ప్రాజెక్ట్ ప్రకటన నుంచే సినీ అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘బాహుబలి’, ‘RRR’ వంటి విజయాల తర్వాత రాజమౌళి ఎంచుకున్న ఈ అంశం గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది. ఆఫ్రికా దేశాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 15 వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి వారణాసి అనే టైటిల్ వాడుకలో ఉంది.

Read also-Telugu movies records: తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏంటో తెలుసా.. పుష్ప అనుకుంటే పొరపాటే..

‘SSMB29′ ఒక పూర్తిస్థాయి గ్లోబల్ యాక్షన్-అడ్వెంచర్ ఎపిక్ గా రూపొందుతోంది. ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ ఫ్రాంచైజీ ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఉంటూ, భారతీయ మూలాలను జోడించనున్నట్లు తెలుస్తోంది. కథ సుమారు 1800ల నాటి నేపథ్యంలో, ప్రధానంగా ఆఫ్రికాలోని దట్టమైన అడవులలో సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు పోషించబోయే పాత్ర సాహసికుడు, అన్వేషకుడుగా ఉంటుంది. ఈ పాత్ర రూపకల్పనలో రాజమౌళికి హిందూ పురాణాలలోని హనుమంతుడి పాత్ర నుండి స్ఫూర్తి పొందినట్లుగా తెలుస్తోంది. ఈ అడ్వెంచర్‌లో ఆధ్యాత్మిక కోణం, పౌరాణిక అంశాలు మేళవించే అవకాశం ఉంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆయన కథనంపై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మితం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Just In

01

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.1 కోటికి చేరిన బెట్టింగ్‌లు..?

Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో

Bandi Sanjay: గోదావరిఖనిలో ఆలయాల కూల్చివేత.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

Wine Shops Closed: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హైదరాబాద్‌‌లో మూడు రోజులు వైన్స్ బంద్..?

Businessman Re Release: పోయించడానికి మళ్లీ సారొస్తున్నారు!