Polavaram Project (image credit: twitter)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

Polavaram Project: నీటి కేటాయింపులు మా పని కాదు.. స్పష్టం చేసిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ

Polavaram Project:  ప్రాజెక్టుల సాంకేతిక అంశాలు తమ పరిధిలోకి రావని పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) అథారిటీ సీఈవో, సీడబ్ల్యూసీ చైర్మన్​ అతుల్​ జైన్ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల పని కూడా తమది కాదని తెలిపారు. తెలంగాణ అభ్యంతరాలకు తమకేం సంబంధం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కృష్ణా గోదావరి భవన్​ ఆఫీసులో శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) 17వ సమావేశం నిర్వహించారు. ఇందులో ఏపీ చేపడుతున్న పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్ విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టును నిర్మించకుండా ఏపీని నిలువరించాలని డిమాండ్​ చేశారు.

Also Read: Polavaram Project: పోలవరంతో తెలంగాణకు ముప్పు.. న్యాయ పోరాటానికి రెడీ.. కవిత వార్నింగ్!

అంతా​ మారిపోయిందని అభ్యంతరం

బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్‌కు సోర్స్​ పోలవరం ప్రాజెక్టేనని, దీనివల్ల అంతా​ మారిపోయిందని అభ్యంతరం తెలిపారు. ఏపీ నిర్మించేలా ఎగువ రాష్ట్రాలు సైతం ప్రాజెక్టులను నిర్మించుకుంటూ పోతే దిగువ రాష్ట్రాలకు చుక్క నీరు కూడా రాదని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల కోసం ఏపీ పోలవరం కుడి కాల్వ, ట్విన్​ టన్నెల్స్​ కెపాసిటీని రెట్టింపు చేస్తున్నదని ఇరిగేషన్​ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా వివరించారు. ఏపీ అధికారులు మాత్రం రాష్ట్ర భవిష్యత్​ అవసరాలను దృష్టిలో పెట్టుకునే పోలవరం ప్రాజెక్ట్ విస్తరణను చేపట్టామని, అయినా సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకునేలా ప్రతిపాదించామని, అవి వరద జలాలని వాదించారు.

ఫేజ్ ​1ను 2027 డిసెంబర్​ నాటికి పూర్తి చేస్తాం

ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్మన్​ అతుల్​ జైన్ మాట్లాడుతూ, కేంద్ర గెజిట్​ నోటిఫికేషన్​ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, మెయింటెనెన్స్​, ఆపరేషన్​ మాత్రమే తాము చూస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫేజ్ ​1ను 2027 డిసెంబర్​ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్ట్ బ్యాక్ వా​టర్‌తో 6 పెద్ద వాగుల ప్రవాహాలపై పడే ప్రభావం మీద సర్వే చేయాలని, రాష్ట్రంలో ప్రొటెక్షన్​ వర్క్స్​ చేపట్టాలని 2022 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని, ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలంలోని ఏటపాక ఔట్​ఫాల్​ రెగ్యులేటర్​, భద్రాచలం మునిగిపోయే ప్రమాదం ఉంటుందని రాహుల్​ బొజ్జా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ, తెలంగాణ, పీపీఏ అధికారులతో జాయింట్​ కమిటీని ఏర్పాటు చేస్తామని అతుల్​ జైన్​ పేర్కొన్నారు. తుది నివేదిక అనంతరం ఆ ఔట్​ఫాల్​ రెగ్యులేటర్ల ఆపరేషన్లపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Also Read: Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్​.. అథారిటీతో కలిసి చేయనున్న సీడబ్ల్యూసీ!

Just In

01

Cotton Farmers: జాతీయ రహదారులపై రైతుల ఆందోళన .. భారీగా నిలిచిపోయిన వాహనాలు

DCC Presidents: తుది దశకు చేరిన ఏఐసీసీ కసరత్తు.. ఈ జిల్లాలో డీసీసీ పదవిపై ఉత్కంఠ!

BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?

Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’గా ఎవరో తెలుసా? టీజర్ విడుదల

Heart Attack: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్‌ఎస్ నేత