Akhanda 2 (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2: ‘తాండవం’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. గూస్‌బంప్స్!

Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapatri Srinu) పవర్ ఫుల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 Thaandavam). ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ‘అఖండ’కు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి (M Tejeswini Nandamuri) సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అఖండ 2: తాండవం’ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని, ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేయగా.. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు.

Also Read- Bus Seat Dispute: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి.. బస్సులో అసలేం జరిగిందో తెలిస్తే షాకే!

ప్రోమోతోనే గూస్‌బంప్స్ తెప్పించారు

తాజాగా మేకర్స్ అఖండ 2: తాండవం నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘తాండవం’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతూ.. ఈ సినిమాను ట్రెండింగ్‌లోకి తెచ్చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ పవర్ ఫుల్ బీట్స్, డివోషనలో చాంట్స్‌తో ఈ సాంగ్‌ని అద్భుతంగా కంపోజ్ చేసినట్లుగా ఈ ప్రోమో తెలియజేస్తుంది. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకంతో బాలకృష్ణ చేసిన అఖండ తాండవం గూస్‌బంప్స్ తెప్పిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ ప్రోమో అంచనాలను పెంచేస్తూ.. ఫుల్ సాంగ్ కోసం వేచి చూసేలా చేస్తోంది. ‘తాండవం’ ఫుల్ సాంగ్‌ను నవంబర్ 14న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. ప్రమోషన్స్‌లో భాగంగా రానున్న మొదటి పాటకే డివోషనల్ టచ్ ఇస్తుండటంతో.. అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.

Also Read- SSMB29 Kumbha first look: ‘SSMB29’నుంచి మరో అప్డేట్.. ఆ పోస్టర్ ఏంటి బాసూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది..

ఫ్యాన్స్ వెయిటింగ్..

నందమూరి నటసింహం బాలయ్య సరసన సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. హర్షాలి మల్హోత్రా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘అఖండ’ను మించేలా బోయపాటి ఈ చిత్రాన్ని సిద్ధం చేసినట్లుగా ఇప్పటికే వచ్చిన టీజర్ తెలియజేసింది. టీజర్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 5 డిసెంబర్, 2025న పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిజల్ట్‌పై రష్మిక మందన్నా స్పందనిదే..

Naga Vamsi: నాగవంశీని 2025 భయపెట్టిందా? అందుకే ‘ఫంకీ’ని 2026కు వాయిదా వేశారా?

S Thaman: ‘చికిరి’తో థమన్ శాటిస్ ఫై అయ్యాడా?

Nagabandham: ‘నాగబంధం’‌లోని ‘ఓం వీర నాగ’ పాటకు కొరియోగ్రఫీ ఎవరంటే..

Akhanda 2: ‘తాండవం’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. గూస్‌బంప్స్!