Telangana: అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి కీలక పిలుపు
Sridhar-Babu (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Telangana: అమెరికా – యూటా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు కీలక పిలుపు

Telangana: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో  ‘తెలంగాణ’ రోల్ మోడల్

లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్, కో-క్రియేషన్‌కు ప్రాధాన్యమన్న మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన ‘తెలంగాణ’లో (Telangana) అవకాశాలు పుష్కలమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా – యూటా పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ – యూటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని ‘యూటా పారిశ్రామికవేత్తల బృందం’ శుక్రవారం సచివాలయంలో మంత్రితో భేటీ అయింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో ‘యూటా – తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక, గ్లోబల్ ఎకానమీకి సపోర్ట్ ఇచ్చేలా, లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు.

Read Also- CM Revanth Reddy: బంద్ పేరుతో బెదిరింపులు.. ప్రైవేటు కాలేజీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రోత్సాహాకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టీ-హబ్, టీ- వర్క్స్, వీ హబ్ లను వరల్డ్ ట్రేడ్ సెంటర్ – యూటా, సిలికాన్ స్లోప్స్ అండ్ యూటా టెక్ స్టార్టప్‌లతో అనుసంధానించేలా చొరవ చూపాలని కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో యూనివర్సిటీ ఆఫ్ యూటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి అకడమిక్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

‘యూటా’ రాష్ట్రంతో పటిష్ఠమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ద్వైపాక్షిక సహకారం పెట్టుబడులకే పరిమితం కాకుండా ఇన్నోవేషన్, స్కిల్స్, టెక్నాలజీ రంగాల్లోఉమ్మడి ఆవిష్కరణలకు దిక్సూచీగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణ లాంటి ఫాస్ట్-గ్రోయింగ్, డైనమిక్, ప్రో-యాక్టివ్ రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు ‘యూటా’ సిద్ధంగా ఉందని డేవిడ్ కార్లెబాగ్ అన్నారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలంగాణతో కలిసి చురుగ్గా పని చేస్తామన్నారు.

Read Also- CM Revanth Reddy: కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్

Just In

01

MLC Kavitha: అమరుల కుటుంబాలకు కోటి అందే వరకు పోరాటం.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Doctors Recruitment: గుడ్‌న్యూస్… త్వరలోనే డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

Mandadi Movie: విడుదలకు సిద్ధమవుతున్న సుహాస్ ‘మండాడి’.. హైలెట్‌గా సెయిల్ బోట్ రేసింగ్..

Jana Nayagan Trailer: విజయ్ దళపతి జననాయకుడు ట్రైలర్ వచ్చేసింది..

Jetlee Glimpse Out: ‘జెట్లీ’ గ్లింప్స్ వచ్చేశాయ్.. సత్య వేమన పద్యం ఇరగదీశాడుగా..