Private-colleges (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Private Colleges Opening: రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు ఓపెన్.. వెనక్కితగ్గిన యాజమాన్యాలు

Private Colleges Opening: తెలంగాణలో రేపటి (నవంబర్ 8) నుంచి ప్రైవేటు కాలేజీలు (Private Colleges Reopening) తెరచుకోనున్నాయి. బకాయిల చెల్లింపు వ్యవహారంపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో, నిరసన కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్టు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. బకాయిలకు సంబంధించి రూ.1,500 కోట్లు చెల్లించాలని యాజమాన్యాలు కోరగా, ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశామని, మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిగతా రూ.300 కోట్లను కొన్ని రోజుల్లోనే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో, నిరసన కార్యక్రమాలపై ప్రైవేటు కాలేజీలు వెనక్కి తగ్గాయి.

విద్యార్థుల చదువులు ప్రభావితం అయ్యేలా నిరసన తెలిపేందుకు యాజమాన్యాలు సిద్ధమవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బ్లాక్‌మెయిల్ చేస్తే ఊరుకునేది లేదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో, యాజమాన్యాలు చర్చలకు వెళ్లాయి. మొత్తంగా రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టు అయింది.

Read Also- Private Colleges Reopening: రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు ఓపెన్.. వెనక్కితగ్గిన యాజమాన్యాలు

కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోతే బంద్‌ నిర్వహిస్తామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించడంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం తగదన్నారు. స్టూడెంట్స్ జీవితాలను ఆటవస్తువులుగా భావించడాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని క్లారిటీ ఇచ్చారు. తమాషాలు చేస్తే తాట తీస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి.

Read Also- IFFI 2025: ‘సంక్రాంతికి వస్తున్నాం’కు అంతర్జాతీయ గౌరవం.. ఇండియన్ పనోరమాకు ఎంపిక

విడతలవారీగా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించబోమన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాకే కొత్తగా సమస్యలు పుట్టుకొచ్చినట్లుగా కొందరు మాట్లాడుతున్నారని, అంతకుముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు లేవా అని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో నాకు బాగా తెలుసు. అది తెలుసుకోలేనంత తెలివితక్కువ వాళ్లం కాదు. తమాషాలు చేస్తే తాట తీస్తాం. నా హయాంలో ఉన్న బకాయిలను తొలి ప్రాధాన్యత కింద చెల్లిస్తాం. విద్యను సేవగా భావించాలి, అంతేతప్పా వ్యాపారంగా చూడకూడదు. అడిగినంత ఇవ్వలేదని కాలేజీలు మూసేస్తామంటే ఊరుకునేది లేదు. బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం సహించబోదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి.

Just In

01

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిజల్ట్‌పై రష్మిక మందన్నా స్పందనిదే..

Naga Vamsi: నాగవంశీని 2025 భయపెట్టిందా? అందుకే ‘ఫంకీ’ని 2026కు వాయిదా వేశారా?

S Thaman: ‘చికిరి’తో థమన్ శాటిస్ ఫై అయ్యాడా?

Nagabandham: ‘నాగబంధం’‌లోని ‘ఓం వీర నాగ’ పాటకు కొరియోగ్రఫీ ఎవరంటే..

Akhanda 2: ‘తాండవం’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. గూస్‌బంప్స్!