Bandi Sanjay (imagecredit:twitter)
Politics

Bandi Sanjay: జూబ్లీహిల్స్ ప్రచారంలో.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?

Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోరబండలో రోడ్ షో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ముస్లింల టోపీ పెట్టుకుని నమాజ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, తాను అటువంటి పని చేయనని, ఎందుకంటే తాను హిందువునని, ఇతర మతాలను గౌరవిస్తాను తప్పితే కించపరచనని స్పష్టం చేశారు. టోపీ పెట్టుకునే పరిస్థితి వస్తే తల నరుక్కుంటానని వ్యాఖ్యానించారు. కాంగ్రెసోళ్ల తీరు చూస్తుంటే అనుమానంగా ఉందని, వారి డీఎన్‌ఏను చెక్ చేయాల్సిందేనని సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము మీటింగ్ పెట్టుకుంటే అనుమతి ఇచ్చి మళ్లీ రద్దు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Minister Seethakka: నెదర్లాండ్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలు తెలిపిన మంత్రి సీతక్క

గోపీనాథ్ చావుకు కారణం..

పాతబస్తీలోనే సభ పెట్టి సత్తా చూపించిన తమను ఆపడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. కేసీఆర్(KCR) పెద్ద మూర్ఖుడు అయితే, ఆయన కొడుకు ఇంకా పెద్ద మూర్ఖుడని విమర్శించారు. కేటీఆర్(KTR)‌కు తండ్రి సీఎం కావాలనే ఆశ లేదని, ఆయనను పక్కకు తోసి ఎప్పుడెప్పుడు సీఎం కావాలని చూస్తున్నాడన్నారు. కల్వకుంట్ల కవిత(kavitha).. కేటీఆర్(KTR), బావ, బాబాయి కొడుకుతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అప్పుడప్పుడు కేసీఆర్ దగ్గరకు వెళ్లి బాగోగులు చూసుకోవాలని కూడా హితవు పలికారు. మాగంటి గోపీనాథ్ చావుకు కారణం కేటీఆరేనని ఆమె తల్లే చెబుతోందని బండి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో గతంలో ఒవైసీ, కేసీఆర్ ట్యాక్స్ ఉండేదని ఎద్దేవాచేశారు.

Also Read: Hesham Abdul Wahab: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి నాకు స్ఫూర్తినిచ్చిన అంశమదే!

Just In

01

Mrutyunjaya Yagna: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆకాంక్షిస్తూ.. సంగారెడ్డి జిల్లాలో మృత్యుంజయ యజ్ఞం

Bus Seat Dispute: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి.. బస్సులో అసలేం జరిగిందో తెలిస్తే షాకే!

Kamal Haasan: బర్త్‌డే స్పెషల్ ట్రీట్.. యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్‌తో కమల్ చిత్రం

CM Revanth Reddy: బంద్ పేరుతో బెదిరింపులు.. ప్రైవేటు కాలేజీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Hyderabad Crime: కాలేజీ విద్యార్థినితో వివాదం.. బస్సు ఆపి మరి కండక్టర్, డ్రైవర్‌పై దాడి