Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 డే 36 ప్రోమో 1 వచ్చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో దివ్య Vs సాయి Vs రీతూ వీరి మధ్య ఫైట్ మాములుగా లేదు. మొదటి బెల్ మోగగానే ట్రైన్స్ వైపు పరుగెత్తి ఏదైనా ఒక ట్రైన్ కి డ్రైవర్ అవ్వడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. తన ట్రైన్ లో ఉన్న కంటెండర్స్ లో ఒకర్ని ఎంచుకుని కారణాలు చెప్పి, వారిని ఆ ట్రైన్ నుంచి దింపి కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలని బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు.
మీరు ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడటం లేదని సాయి దివ్య మొఖం మీదే చెప్పాడు. దీంతో వీరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ మాటలకు హర్ట్ అయినా దివ్య తీసేయ్ నన్ను పర్లేదు అంటూ విరుచుకుపడింది. మంచి కంటెండర్ అని చెప్పిన వాళ్లే కంటెండర్ షిఫ్ట్ నుంచి తీస్తే ఏంటి మరి సాయి దాన్ని ఏమనుకోవాలని అన్నది. బిగ్ బాస్ సాయి మీ నిర్ణయం చెప్పండి అనగానే.. నా నిర్ణయం రీతూ అని చెప్పాడు. పాపం పాప ఒక్కసారిగా షాక్ అయ్యి.. ఒక్క నిముషం నేనెందుకు చెప్పు అని సాయిని రీతూ అడగగా.. నువ్వు తీసేది కెప్టెన్సీ రేస్ నుంచి.. అది కూడా పక్కన వాళ్ళు చెప్పింది విని ? పక్కన వాళ్ళు చెప్పింది నేను వినలేదు అని సాయి అన్నాడు. నీ ట్రైన్ ఎక్కమని చెప్పి .. ఇప్పుడు నువ్వు నన్ను పొడుస్తున్నావా ఇప్పుడు ? నేను దివ్యను నమ్మి ఇచ్చాను .. నేను ట్రైన్ ఎక్కిస్తా అన్నందుకే నీ ట్రైన్ ఎక్కాను నేను. లేకపోతే నేను నీ ట్రైన్ ఎక్కేదాన్ని కాదని రీతూ సాయి పై ఫైర్ అయింది.
నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావ్.. దివ్య నేను నమ్మించాను.. ఇప్పుడు తనని తీస్తాను అంటే? దీన్ని ఏమనుకోవాలి సాయి .. వైల్డ్ కార్డు ఎంట్రీస్ కి సపోర్ట్ చేయొద్దు అని వారి మాటలు నమ్మి ఇలా చేస్తున్నావ్ .. చెయ్ నాకేం పర్లేదు, నేను ఇప్పుడు ఈ ఇంటి కెప్టెన్ ఆంట్ సాయికి గట్టిగా ఇచ్చి పడేసింది.
