TG Transport Department (imagecredit:twitter)
తెలంగాణ

TG Transport Department: బీ కేర్‌ఫుల్.. ఈ నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్..!

TG Transport Department: రవాణా శాఖ నిబంధనలు అతిక్రమించే వాహనాలను సీజ్ చేస్తామని ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్(Chandrasekhar Goud) హెచ్చరించారు. వాహనాల ఓవర్ స్పీడ్‌కు కళ్లెం వేస్తామని, తనిఖీలు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 6 వరకు చట్టాలను ఉల్లంఘించిన 1,15,000కు పైగా వాహనాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇందులో 5,000 కు పైగా ఓవర్ లోడ్‌తో తిరుగుతున్న వాహనాలు ఉండగా 9,000 పైగా ప్రైవేట్ బస్సులు ఉన్నాయని వెల్లడించారు.

వాహనాలపై కేసులు..

ఇవే కాకుండా ఫిట్‌నెస్ లేని వాహనాలు, ట్యాక్స్ లేకుండా తిరిగే వాహనాలతో పాటు పర్మిట్, డ్రైవింగ్ లైసెన్సులు(Driving licenses), ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఉన్నాయని తెలిపారు. 33 జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఓవర్ లోడ్ వాహనాలపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని, గత మూడు రోజులుగా 550 కి పైగా వివిధ వాహనాలపై కేసులు నమోదు చేస్తే అందులో 85కు పైగా ఓవర్ లోడ్‌తో తిరిగేవి ఉన్నాయని వెల్లడించారు. త్వరలో మైనింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, రీచ్‌లు, క్వారీలలోనే ఓవర్ లోడ్‌ను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: Minister Seethakka: నెదర్లాండ్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలు తెలిపిన మంత్రి సీతక్క

అవగాహనా కార్యక్రమాలు..

మైనింగ్ క్వారీలు(Mining quarries), ఇసుక రీచ్(Sand Reach) యజమానులకు నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న అంశమని, వాహన కండిషన్ సరిగ్గా లేకపోవడం, ఓవర్ స్పీడ్(Over Speed), ఓవర్ లోడ్(Over Load)‌తోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఏడాది పాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చి రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించాలని చెప్పారు. బ్లాక్ స్పాట్లను గుర్తిస్తామని, ఓవర్ లోడ్ వాహనాలను గుర్తించి సీజ్ చేస్తామని చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు.

Also Read: WhatsApp Username: త్వరలోనే వాట్సప్‌లో కొత్త ఫీచర్.. నంబర్ ఎవరికీ కనబడదు!

Just In

01

Air India Crash: ఎయిరిండియా క్రాష్ ఘటన.. పైలెట్‌ తండ్రికి సుప్రీంకోర్టు ఓదార్పు.. కీలక వ్యాఖ్యలు

Phoenix review: ‘ఫీనిక్స్’ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించిందా..

Harish Rao On CM: సీఎం రేవంత్ బ్లాక్ మెయిలర్.. జూబ్లీహిల్స్‌‌లో బుద్ధి చెప్పాలి.. హరీశ్ రావు ఫైర్

Cancer Awareness: పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌ పెద్దల దానికంటే ఎందుకు భిన్నంగా ఉంటుందో తెలుసా?

Breakfast: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?