preweddingsho(image :X)
ఎంటర్‌టైన్మెంట్

The Great Pre-Wedding Show: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో తిరువీర్ చేసిన పనులు నవ్వించాయా.. తెలియాలంటే..

సినిమా పేరు: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
రిలీజ్ డేట్: 7 నవంబర్, 2025
డైరెక్టర్: రాహుల్ శ్రీనివాస్
కాస్ట్: తిరువీర్ (రమేష్), టీనా శ్రావ్య (హేమ), నరేంద్ర రవి (ఆనంద్), యామిని (సౌందర్య), మాస్టర్ రోహాన్ రాయ్ (రోషన్) మొదలైనవారు
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి

The Great Pre-Wedding Show: తిరువీర్ ‘పలాస’, ‘మసూద’, ‘పరేషాన్’ వంటి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన మార్క్ సంపాదించుకున్నారు. ఈసారి ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’లో శ్రీకాకుళంలో సింపుల్ ఫోటోగ్రాఫర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, రిలీజ్‌కి రెండు రోజుల ముందే ప్రీమియర్స్‌తో ఆసక్తి పెంచింది. మరి ఈ మూవీ ఎంటర్‌టైన్ చేసిందా? లేదా కేవలం ప్రీ-వెడ్డింగ్ ట్రెండ్‌పై ఆధారపడి ముగిసిందా? వివరంగా చూద్దాం.

కథ

శ్రీకాకుళంలోని ఒక మారుమూల గ్రామంలో రమేష్ (తిరువీర్) చిన్న ఫోటో స్టూడియో, జిరాక్స్ సెంటర్ నడుపుతూ ఊర్లోల పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లకు ఫోటోలు తీస్తూ జీవితాన్ని గడుపుతాడు. మొహమాటం, భయం, బిడియం ఈ మూడూ అతనిలో పోటీ పడతాయి. షాపు ఎదురుగా పంచాయతీ ఆఫీస్‌లో పని చేసే హేమ (టీనా శ్రావ్య) అంటే రమేష్‌కి చాలా ఇష్టం. మంచితనంతో ప్రసిద్ధి చెందిన హేమకి కూడా రమేష్ అంటే ఇష్టమే. కానీ ఇద్దరూ కళ్లతోనే ప్రేమించుకుంటూ, ఒకరికొకరు భావాలు చెప్పుకోలేకపోతారు. అంతేకాకుండా, ఊరిలో రాజకీయ బలగం కలిగిన ఆనంద్ (నరేంద్ర రవి)కి సౌందర్య (యామిని)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ట్రెండీగా ప్రీ-వెడ్డింగ్ షూట్ చేయాలని నిర్ణయించుకుని, రమేష్‌ని సంప్రదిస్తారు. కానీ రమేష్ మాత్రం ఆ ఇద్దరి పెళ్లి చెడగొట్టాలని మనసులో పెట్టుకుంటాడు. దీనికి కారణం ఏమిటి? ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో జరిగిన అనుకోని మిస్టేక్ ఏంటి? హేమని ఉపయోగించుకుని రమేష్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా? రమేష్-హేమ లవ్ స్టోరీ ఎలా ముగుస్తుంది? ఆనంద్-సౌందర్య పెళ్లి ఏమైంది? – ఇవన్నీ తెలుసుకోవాలంటే థియేటర్‌కి వెళ్లాల్సిందే.

Read also-Chikiri song out: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి ‘చికిరి’ సాంగ్ వచ్చేసింది..

ఎవరు ఎలా చేశారంటే..

సింపుల్ కామన్ మ్యాన్ రోల్‌లో తిరువీర్ ఫిట్ అయ్యాడు. అతని టైమింగ్, ఎమోషన్స్ మూవీకి మెయిన్ స్ట్రెంగ్త్. ఫస్ట్ హాఫ్‌లో రమేష్-హేమ మధ్య సన్నివేశాలు, అసిస్టెంట్ రోషన్ (రోహాన్ రాయ్)తో వచ్చిన కామెడీ సీన్స్ చాలా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ప్రీ-వెడ్డింగ్ షూట్ సన్నివేశాలు సూపర్‌గా వచ్చి నవ్వులు పూయిస్తాయి. నరేంద్ర రవి (ఆనంద్) క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆనంద్ పాత్ర అన్ని పాత్రలను డామినేట్ చేస్తుంది. యామిని, రోహాన్ రాయ్ తమ నటనతో నవ్వులు తెప్పించారు. టీనా శ్రావ్య అందంగా కనిపించి, నటనతోనూ ఆకట్టుకుంది.

సాంకేతికంగా..

సురేష్ బొబ్బిలి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ శ్రీకాకుళం ప్రాంత ప్రకృతి అందాలను బాగా క్యాప్చర్ చేసింది. డైలాగులు క్లీన్‌గా, పల్లెటూరు ఫ్లేవర్‌తో పేలాయి. దర్శకత్వం విషయానికి వస్తే.. రాహుల్ శ్రీనివాస్ సింపుల్ విలేజ్ కామెడీ-డ్రామాను క్లీన్‌గా తెరపైకి తీసుకొచ్చాడు. ఇంటర్వల్ ట్విస్ట్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది. చిన్న బడ్జెట్ సినిమాలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. కథ చాలా చిన్నది, నేచురల్‌గా ఉన్నా మరింత డెప్త్ ఉండి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్‌లో కొంత సాగుతున్న ఫీల్ కలుగుతుంది. డాక్యుమెంటరీ స్టైల్ సీన్స్ కొన్ని చోట్ల డ్రాగ్ అయ్యాయి. రచయితగా డైరెక్టర్ మరింత పాలిష్ చేస్తే మెరుగ్గా ఉండేది. శ్రీకాకుళం ప్రకృతి అందాలను మరింత ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు.

Read also-KodamaSimham re release: మెగాస్టార్ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

బలాలు

  • తిరువీర్ నటన
  • కామెడీ టైమింగ్
  • మ్యూజిక్

బలహీనతలు

  • సెకండ్ హాఫ్
  • కథలో డెప్త్ లేకపోవడం

ఓవరాల్‌గా… ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హాయిగా నవ్వుకునే, క్లీన్ విలేజ్ ఎంటర్‌టైనర్

రేటింగ్: 3 /5

Just In

01

Air India Crash: ఎయిరిండియా క్రాష్ ఘటన.. పైలెట్‌ తండ్రికి సుప్రీంకోర్టు ఓదార్పు.. కీలక వ్యాఖ్యలు

Phoenix review: ‘ఫీనిక్స్’ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించిందా..

Harish Rao On CM: సీఎం రేవంత్ బ్లాక్ మెయిలర్.. జూబ్లీహిల్స్‌‌లో బుద్ధి చెప్పాలి.. హరీశ్ రావు ఫైర్

Cancer Awareness: పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌ పెద్దల దానికంటే ఎందుకు భిన్నంగా ఉంటుందో తెలుసా?

Breakfast: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?