rashika (X)
ఎంటర్‌టైన్మెంట్

The Girlfriend review: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ జెన్యూన్ రివ్యూ.. రష్మిక ఏం మాయ చేసిందో తెలియాలంటే..

చిత్రం: ది గర్ల్‌ఫ్రెండ్
దర్శకుడు: రాహుల్ రవీంద్రన్
నటీనటులు: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, రోహిణి మొదలైనవారు
సంగీతం: హేషామ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్
నిర్మాతలు: గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ తేదీ: నవంబర్ 7, 2025

The Girlfriend review: రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గీతా ఆర్ట్ పతాకం నుంచి ఈ సినిమా విడుదల అవడంతో మంచి ప్రచారమే దక్కిందని చెప్పుకోవాలి. ఒక అమ్మాయి చుట్టూ కథను రాసుకుని చాలా బాగా తెరకెక్కించారిని ఇప్పటికే దర్శక, నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో ప్రేక్షకుల అంచనాలు కూడా ఆరాశాన్ని అంటాయి. మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుందా? కథ ప్రేక్షకులను మెప్పించిందా?.. అసలు ఏం జరిగింది అన్నది ఈ రివ్యూ లో చూద్దాం..

Read also-Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

కథ

భూమా దేవి అలియాస్ భూమా (రష్మిక మందన్న) తండ్రి (రావు రమేశ్) చాటున పెరిగిన అమాయకమైన అమ్మాయి. ఎంఏ లిటరేచర్ చదవడానికి తొలిసారి నగరానికి వచ్చి ఓ పీజీ కాలేజీలో చేరుతుంది. అక్కడే విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. విక్రమ్ ఆవేశపరుడు. భూమా అతనికి నచ్చడంతో ప్రేమలో పడతారు. దుర్గ కూడా విక్రమ్‌ను ఇష్టపడుతుంది కానీ అతను భూమానే ఎంచుకుంటాడు. ప్రేమలో పడిన తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆమె తీసుకున్న నిర్ణయాలు, సంబంధాల్లో వచ్చే సంఘర్షణలు, ఆత్మవిశ్వాసం, గుర్తింపు వంటి అంశాలు ముడిపడి ఉంటాయి. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు. రిలేషన్‌షిప్‌లలో మెచురిటీ లేకపోవడం, టాక్సిక్ బంధాలు, ఆత్మ గౌరవం గురించి చర్చిస్తుంది. అమ్మాయిలు రెండు బంధాలకు లొంగి ఎలా కుంగిపోతారో వాటి నుంచి బయటకు వచ్చే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది.

ఎవరు ఎలా చేశారంటే..

రష్మిక మందన్న భూమా పాత్రలో అద్భుతంగా నటించింది. అమాయకత్వం నుంచి భావోద్వేగాల వరకు ఒకే ఫ్రేమ్‌లో మార్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమె నటనకు వంద మార్కులు ఇవ్వవచ్చు. దీక్షిత్ శెట్టి విక్రమ్ పాత్రలో స్టైలిష్‌గా మొదలై, యాంగ్రీ యంగ్ మెన్ లా మారతాడు. ఇక అను ఇమ్మాన్యుయేల్ స్పార్క్ ఇచ్చింది. హీరోయిన్ అమ్మగా నటించిన రోహిణి ఒకప్పుడు ఆడవారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను కళ్లకు కట్టేలా చూపించింది. రావు రమేశ్ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. రాహుల్ రవిచంద్రన్ పాత్ర చాలా ఇంపేక్ట్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటే.. చాలా సాదా సీదాగా వెళిపోయింది.

Read also-Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!

టెక్నికల్ గా..

కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. షవర్ సీన్, మిరర్ షాట్స్, సింబాలిక్ ఇమేజరీ దర్శకత్వాన్ని ఎలివేట్ చేశాయి. హేషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం, “నధివే” సాంగ్ ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. రాహుల్ రవీంద్రన్ రచన, సంభాషణలు బాగా లోతుగా తగులుతాయి. విజువల్ గా ఈ సినిమా చాలా బాగుంటుంది. కృష్ణన్ వసంత్ కెమెరా పనితనం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది. చివరిగా దర్శకత్వం గురించి మాట్లాడితే.. రాహుల్ రవిచంద్రన్ మంచి థీమ్ తో వచ్చారు. తీయడంలో అక్కడక్కడా కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. ఆరంభ సన్నివేశాలు స్లో, ఊహకందేలా సాగుతాయి. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. మగవాళ్లను మాత్రమే నెగెటివ్‌గా చూపించినట్టు అనిపించవచ్చు, రెండు వైపులా ఏం జరుగుతుందో చెప్పిఉంటే బాగుండును.

బలాలు

  • రష్మిక నటన
  • విజువల్స్
  • సంగీతం
  • క్లైమాక్స్

బలహీనతలు

  • స్లోరీ ప్రెడిక్టబుల్
  • బ్యాలెన్స్ లోపం.

రేటింగ్: 3 /5

Just In

01

DGP Shivadhar Reddy: దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్​ స్థానం: డీజీపీ శివధర్ రెడ్డి

New Ducati Multistrada V2: భారత మార్కెట్‌లోకి డుకాటి మల్టీస్ట్రాడా V2 బైక్‌.. ఫీచర్లు ఇవే!

Maganti Family Dispute: మాగంటి అసలైన వారసుడ్ని నేనే.. నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ప్రద్యుమ్న తారక్

CM Revanth Reddy: గెలుపు మనదే అయినా.. మెజారిటీ పై గురి పెట్టాల్సిందే కదా..!

Chikiri song out: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి ‘చికిరి’ సాంగ్ వచ్చేసింది..