Parasakthi (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Parasakthi: తమిళ హీరో శివకార్తికేయన్ తన తదుపరి భారీ చిత్రం ‘పరాశక్తి’తో 2026 సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి తాజాగా విడుదలైన తొలి పాట ‘హే సింగారాల సీతాకోకవే.. నీ అలకే తొలగి’ యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో శివకార్తికేయన్, తెలుగు గ్లామర్ క్వీన్ శ్రీలీలల మధ్య కెమిస్ట్రీ, రెట్రో థీమ్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

Also Read- Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!

జీవీ ప్రకాష్ మ్యాజిక్.. రెట్రో బీట్‌కు ఫ్యాన్స్ ఫిదా!

దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. సాధారణంగా సుధా కొంగర సినిమాల్లో యాక్షన్, ఎమోషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఒక అందమైన రొమాంటిక్ మెలోడీతో ప్రారంభించడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పాటను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచారు. ఈ పాటలో 70-80ల నాటి రెట్రో మ్యూజిక్ ఫీల్‌ను తీసుకురావడం, దానికి సమకాలీన బీట్‌ను జోడించడం శ్రోతలను వెంటనే కట్టిపడేస్తోంది. తెలుగులో భావోద్వేగభరితమైన పాటలకు పేరుగాంచిన భాస్కరభట్ల అందించిన సాహిత్యం, మెలోడీకి తగ్గట్టుగా హృదయాన్ని తాకేలా ఉంది. ప్రముఖ సింగర్స్ ఎల్వీ రేవంత్, ఢీ, సీన్ రొల్డాన్ ఈ పాటను ఆలపించారు. రేవంత్ వాయిస్ శివకార్తికేయన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది, మెలోడీ ఫ్లోను అద్భుతంగా పలికించింది.

Also Read- Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..

శివకార్తికేయన్, శ్రీలీల కెమిస్ట్రీ అదుర్స్!

‘పరాశక్తి’ ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ రొమాంటిక్ పాట సినిమాకు మరొక కోణాన్ని పరిచయం చేసింది. ముఖ్యంగా, శివకార్తికేయన్, శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. పాటలో వారిద్దరి మధ్య ఉన్న కూల్ కెమిస్ట్రీ.. శ్రీలీల తనదైన స్టైల్‌లో వేసిన అలరించే డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రెట్రో గెటప్‌లలో వీరిద్దరూ చాలా ఫ్రెష్‌గా కనిపించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌ను ఇంత స్టైలిష్‌గా మొదలుపెట్టడంతో, పండుగ బరిలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. శివకార్తికేయన్ గత చిత్రం ‘మదరాసి’ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అలాగే శ్రీలీల నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!