Kaantha Movie Team (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rana Daggubati: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా చిత్రం ‘కాంత’ (Kaantha). నవంబర్ 14న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర టీజర్, పాటలు అద్భుతమైన స్పందనను రాబట్టుకుని, సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా గురువారం చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంపై ట్రైలర్‌తో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి. చిత్ర ట్రైలర్‌ విడుదల సందర్భంగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్రయూనిట్ మొత్తం పాల్గొన్నారు.

Also Read- Allu Arjun: జక్కన్న, నీల్, వంగా.. బన్నీ లైనప్ చూస్తుంటే మెంటలొచ్చేస్తుంది! ఇక తగ్గే దే లే..

సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు

ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ.. ‘‘కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు. అదెలా అంటే.. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి స్టూడియోస్ లేవు. అందరూ విజయ స్టూడియో, వాహిని స్టూడియో, ఏవీఎమ్ స్టూడియోల గురించే మాట్లాడుకునే వాళ్ళు, స్టార్స్ గురించి మాత్రమే చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడూ సోషల్ మీడియా ఉంది. అప్పుడు స్టూడియోలో జరిగే విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసేవి. అలాంటి బ్యాక్ డ్రాప్‌లో సెల్వమణి సెల్వరాజ్‌ కథ చెప్పడం జరిగింది. కథ విన్న వెంటనే కచ్చితంగా నాకు ఈ సినిమా చేయాలనిపించింది. ఇలాంటి పీరియడ్ సినిమాకు దుల్కర్ సల్మాన్ వంటి రెట్రో కింగ్ పర్ఫెక్ట్. నవంబర్ 14 తర్వాత దుల్కర్ సల్మాన్‌ను అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు. ‘భీమ్లా నాయక్’లో సముద్రఖని కుమారుడిగా చేశాను. ఇందులో మా రిలేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దుల్కర్, సముద్రఖని వంటి అద్భుత నటుల మధ్య భాగ్యశ్రీ నిలబడటం మాములు విషయం కాదు. నవంబర్ 14న అందరినీ థియేటర్స్‌లో కలుస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!

థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ట్రైలర్ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్‌లో చూడండి. ఎందుకంటే ఇది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవె‌ల్లో ఉంటుందని నాకు తెలుసు. ఇది మా అందరికీ చాలా స్పెషల్ సినిమా. నా బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి పని చేసినందుకు చాలా హ్యాపీ. నేను వాళ్ళింట్లో అబ్బాయిలానే ఉంటాను. మేమిద్దరం కలసి సినిమా చేయడం.. నిజంగా చాలా ఆనందంగా వుంది. సెల్వ అద్భుతమైన కథను రెడీ చేశారు. సముద్రఖనితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఇందులో ఆయన మెమొరబుల్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ చాలా డిఫరెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాకు మంచి సంగీతం కుదిరింది. ఇది మంచి డ్రామా, థ్రిల్లర్. అందరూ థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇదని చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!