Private Colleges (imagecredit:twitter)
తెలంగాణ

Private Colleges: సర్కార్‌కు ప్రైవేట్ కాలేజీల హెచ్చరిక.. డబ్బు చెల్లించాలని డిమాండ్.. లేదంటే..?

Private Colleges: రాష్ట్రంలో ఐదారేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee reimbursement) బకాయిల్లో కనీసం రూ.5 వేల కోట్లు తక్షణమే విడుదల చేస్తేనే కాలేజీల బంద్ విరమిస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్(Federation of Association of Telangana Higher Education Institutions) ప్రకటించింది. బకాయిల విడుదల కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా డిప్యూటీ సీఎం, మంత్రులు హామీలు ఇచ్చినా ఒక్కటీ నెరవేరలేదని ఫతీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

నెలల జీతాలు పెండింగ్‌..

హైదరాబాద్‌లో నిన్న సమావేశమైన ఫతీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల కోసం ప్రభుత్వం వేసిన కమిటీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ఫతీ చైర్మన్ డాక్టర్ రమేష్ బాబు(Dr. Ramesh Babu) మాట్లాడుతూ.. సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో గత్యంతరం లేక ఈ నెల 3 నుంచి అన్ని ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌మెంట్‌లు సమ్మెకు దిగాయని తెలిపారు. బకాయిల కారణంగా ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉంటున్నాయని చెప్పారు. సమ్మె కారణంగా జేఎన్టీయూ(JNTU), ఓయూ(OU), ఎంజీయూ(MGU) వంటి యూనివర్సిటీల్లో జరిగే పరీక్షలను నిర్వహించలేమని కూడా ఆయన స్పష్టం చేశారు.

Also Read: AICC: జూబ్లీహిల్స్‌పై ఏఐసీసీ ఫోకస్.. చివరి వారం ప్రచారంపై ప్రత్యేక వ్యూహం!

నెలరోజుల్లో ఇచ్చేలా..

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం వేసిన కమిటీని స్వాగతిస్తున్నామని, కానీ ఆ నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని చెప్పడం సరికాదని రమేష్ అన్నారు. దాన్ని నెలరోజుల్లో ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, కమిటీలో నాలెడ్జ్ లేని వ్యక్తులు ఉన్నారని, వారిని తొలగించి, బ్యాంకు నిపుణులను చేర్చుకోవాలని కోరారు. ఫతీ నేతలు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన(Sri Devasena) తమపై దురుసుగా, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆమెను ఆ బాధ్యత నుంచి తప్పించాలని ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఫీజు బకాయిల కోసం ఈ నెల 11న 10 లక్షల మందితో హైదరాబాద్‌లో మరో భారీ సభ పెట్టబోతున్నట్టు ఫతీ ప్రకటించింది.

Also Read: Chilli Market: మార్కెట్ రంగంలో ఐకాన్‌గా ఖమ్మం మిర్చి మార్కెట్.. దీని ప్రత్యేకతలివే..!

Just In

01

Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?

KodamaSimham re release: మెగాస్టార్ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Jaundice: జాండీస్‌ ఎందుకు వస్తుంది? షాకింగ్ నిజాలు చెప్పిన వైద్యులు

Releasing Movies: రేపు థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ముందు దేనికి వెళ్తారు..

Porter Layoffs 2025: పోర్టర్‌లో భారీ ఉద్యోగ కోతలు.. ఖర్చు తగ్గింపు పేరుతో 300 మందికి పైగా ఉద్యోగులకు షాక్