Minister Seethakka (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Seethakka: నెదర్లాండ్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలు తెలిపిన మంత్రి సీతక్క

Minister Seethakka: ప్రజల కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే నిజమైన విప్లవం ఉంటుందని మంత్రి సీతక్క(Minister Seethakka) స్పష్టం చేశారు. నెదర్లాండ్స్‌లో బుధవారం నిర్వహించిన నాయకత్వ సదస్సు ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్ గ్లోబల్ సమ్మిట్’(Vital Voices Global Fellowship Global Summit’)లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రతికూలతల నుంచి సాధికారత వైపు, దేశాలను మారుస్తున్న మహిళల శక్తి అనే అంశంపై సీతక్క తన ప్రసంగాన్ని అందించారు.

16 ఏళ్ల వయసులో న్యాయం కోసం..

ఆమె తన చిన్ననాటి ఆదివాసీ బాలిక జీవితం నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ప్రేరణాత్మక ప్రయాణాన్ని, సమాజానికి అందించిన సేవలను, ప్రజాస్వామ్య పోరాటాలను, కరోనా కాలంలో చేసిన సహాయ కార్యక్రమాలను వివరించారు. ‘నేను తెలంగాణ(Telangana)లోని చిన్న ఆదివాసీ గిరిజ‌న గ్రామంలో పుట్టాను. పేదరికం, అసమానతలు నా బాల్యాన్ని మలిచాయి. 16 ఏళ్ల వయసులో న్యాయం కోసం అడవుల్లోకి వెళ్లి నక్సలైట్ ఉద్యమంలో చేరాను. కానీ, అసలైన మార్పు తుపాకీతో కాదు, విద్య, అనుభూతి, సాధికారతతోనే సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత నేను తిరిగి విద్యను ప్రారంభించాను. ఎంఏ(MA), ఎల్‌ఎల్‌బీ(LLB), ఎల్‌ఎల్‌ఎం(LLM), ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశాను. అడవుల నుంచి ప్రజాస్వామ్య సభల వరకు నా ప్రయాణం సాక్ష్యం’ అని సీతక్క పేర్కొన్నారు.

Also Read: Jatadhara Promotion: సినిమా ప్రమోషన్ ఇలా కూడా చేస్తారా.. సుధీర్ బాబు చేసింది చూస్తే వణకాల్సిందే..

ఇందిరా మహిళా శక్తి పాలసీ..

పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. ఇందిరా మహిళా శక్తి పాలసీ(ndira Gandhi Women Power Policy) ద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మహిళలు క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ(RTC)కి బస్సులు అద్దెకు, పెట్రోల్ బంకులు కూడా నడుపుతున్నారని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని సీతక్క ప్రపంచ వేదికపై వివరించారు.

Also Read: KTR On CM Revanth: హైదరాబాద్‌లో ఎక్కడైనా సరే.. సీఎం రేవంత్‌తో చర్చకు రెడీ.. కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

Just In

01

Election Commission: జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఓటు వేయాలంటే అది తప్పనిసరి.. ఈసీ కీలక ఆదేశాలు

India vs Australia: నాలుగో టీ20లో టీమిండియా మోస్తరు స్కోర్.. గెలుస్తారో, లేదో?

Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?

KodamaSimham re release: మెగాస్టార్ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Jaundice: జాండీస్‌ ఎందుకు వస్తుంది? షాకింగ్ నిజాలు చెప్పిన వైద్యులు