CM Revanth Reddy (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

CM Revanth Reddy: షేక్‌పేట డివిజన్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

CM Revanth Reddy: షేక్ పేట డివిజన్ పారా మౌంట్ కాలనీ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. జూబ్లీ హిల్స్‌లో సెంటిమెంటా లేక డెవలప్మెంటా అన్నది ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సెంటిమెంట్ పేరుతో ఓటు అడిగే హక్కు కేసీఆర్(KCR) కు లేదు. పీజేఆర్ చనిపోయినప్పడు సెంటిమెంట్ లేదని కేసీఆర్ అన్నాడు. ఎంఎల్ ఏ చనిపోతే ఏకగ్రీవం కాకుండా ఉపఎన్నిక లకు నాంది పలికింది కేసీఆర్ అని అన్నారు. పీజేఆర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఆనాడు అవమానించాడు. పీజేఆర్ విహారం ముందు ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్(BRS) నాయకులు బెంజ్ కారు వదిలి ఆటోలో తిరుగుతూ.. సమస్యల గురించి మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్‌లో సమస్యల కు కారణం బీజేపీ, బార్స్ కారణం మా ప్రభుత్వం జూబ్లీ హిల్స్‌లో 3 నెలలో 400 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టిందని అన్నారు.

సవాల్ విసిరి పారిపోవడం..

నవీన్ యాదవ్‌(Naveen Yadav)ని గెలిపిస్తే నియోజవర్గ అభివృద్ధి జరుగుతుంది. 10 ఏళ్లలో కేసీఆర్ ఏమీ ఇవ్వలేదు.. ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతాడు. జూబ్లీ హిల్స్‌లో 2 లక్షల 39 వేల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని, రాబోయే రోజులలో జూబ్లీ హిల్స్ లో 4000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. కాళేశ్వరం(kaleshwaram) అవినీతి పైన సీబీఐ(CBI) విచారణ కోరితే మోదీ పట్టించు కోవడం లేదు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) ని ఎందుకు బొక్కలో వేయడం లేదని మోదీని కిషన్ రెడ్డి నిలదీయడం లేదు? కిషన్ రెడ్డి మూసి నది అభివృద్ధికి, త్రిబుల్ ఆర్‌కు అడ్డుపడుతున్నాడని అన్నారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని అన్నారు. గతంలో నేను వైట్ ఛాలెంజ్ విసిరితే రాకుండా పారిపోయాడు. కంటోన్మెంట్‌లో 4000 కోట్ల అభివృద్ధి పనులు జరగలేదు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని కేటిఆర్ సవాల్ విసిరాడు. కంటైన్మెంట్ ఎంఎల్ ఏ శ్రీ గణేష్(MLA Sri Ganesh) 5000 కోట్ల జీఓలు చూపిస్తే కేటీఆర్ పారిపోయాడని అన్నారు. కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు నవీన్ యాదవ్ విజయం కోసం ఎంఐఎం(MIM) నేతలు కష్ట పడి పని చేస్తున్నారు. నవీన్ యాదవ్‌కు మొదట ఎంఐఎం ఎంఎల్ఏ(MLA) టికెట్ ఇచ్చింది. 30 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడని అన్నారు.

Also Read: Nizamabad MLA PA: ఆ జిల్లాలో నోటీసుల కలకలం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే పీఏగా చేయడం ఏంటి?

మా ప్రభుత్వంలో హిందూ ముస్లిం ఒక్కటే..

సిరాజ్ కోసం అన్ని నిబంధనలు పక్కన పెట్టి డీఎస్పీ(DSP)గా అవకాశం ఇచ్చాం నిక్కత్జరీన్‌ను కూడా డీఎస్పీ గా నియమించాం అజరుద్దీన్‌(Azharuddin)ను మంత్రిని చేశాం అజారుద్దీన్‌ను మంత్రిని చేస్తే కిషన్ రెడ్డి(Kishan Reddy)కి ఎం ఇబ్బంది ఎంటని అన్నారు. ముస్లిం అంటే కాంగ్రెస్(Congress).. కాంగ్రెస్ అంటే ముస్లిం మా ప్రభుత్వంలో హిందూ, ముస్లిం అంతా ఒక్కటే.. మేం ఎలాంటి తారతమ్యం చూపించం అని సీఎం రేవంత్ అన్నారు. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ బీజేపీ(BJP)కి సహకరించక పోతే మోదీ(Modhi) ప్రధాని అయ్యే అవకాశం లేదు. బీజేపీ(BJP).. బీఆర్ ఎస్(BRS) పేరుతో జూబ్లీహిల్స్‌లో ఓటు అడుగుతుంది. కాళేశ్వరం పైన సీబీఐ విచారణ కోరితే 24 గంటల్లో కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని కిషన్ రెడ్డి అన్నాడు. విచారణకు ఆదేశించి 3 నెలలు అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు? జూబ్లీ హిల్స్‌లో మోదీ, కేసీఆర్ ఒక వైపు.. రాహుల్ గాంధీ(Rahul Gandhi), రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ మరో వైపు ముప్పై వేల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం ఖాయం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: KTR On CM Revanth: హైదరాబాద్‌లో ఎక్కడైనా సరే.. సీఎం రేవంత్‌తో చర్చకు రెడీ.. కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

Just In

01

Tollywood: ప్రచారంలో అలా మాట్లాడటం ఎందుకు? ఆ తర్వాత ఫూల్స్ అవడమెందుకు?

Bandla Ganesh: బండ్ల గణేష్ మాటల వెనుకున్న మర్మమేంటి? ఎందుకిలా మాట్లాడుతున్నాడు?

Deputy CM: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.. ‘మా’ బిల్డింగ్‌కు స్థలం కూడా మేమే ఇస్తాం!

CM Revanth Reddy: షేక్‌పేట డివిజన్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

Roja: 90స్ క్వీన్ రీ ఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత ‘సంతానం’గా రోజా!