peddi(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Peddi first single: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి అప్టేట్ అదిరింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

Peddi first single: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ అప్డేట్ గురించి ఇప్పటికే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటకు మోహిత్ చౌహాన్ గాయకుడిగా, రెహమాన్ మ్యాజిక్ మ్యూజిక్‌తో ఈ పాట రానుంది. ప్రస్తుతానికి ప్రోమోను మాత్రమే విడుదల చేశారు. పూర్తి వెర్షన్ పాటను నవంబర్ 7 విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఈ పాటతో ఏఆర్ రెహమాన్-మోహిత్ కాంబో మళ్లీ రాబోతుందని తెలిసిన వెంటనే ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు. ఇప్పటికే జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ పాత్రలో గ్రామీణ లుక్‌తో మెరిసిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై, అభిమానులను ఆకట్టుకుంది. ఈ తాజా అప్‌డేట్స్‌తో ‘పెద్ది’ హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్, మోహిత్ చౌహాన్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read also-Jatadhara Promotion: సినిమా ప్రమోషన్ ఇలా కూడా చేస్తారా.. సుధీర్ బాబు చేసింది చూస్తే వణకాల్సిందే..

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 1980ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలో ఆధారంగా రూపొందుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా, ఒక ఉత్సాహవంతమైన గ్రామస్తుడు తన సమాజాన్ని క్రీడల ద్వారా ఏకం చేసి, శక్తివంతమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే కథను చిత్రిస్తుంది. బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో ఈ చిత్రం మార్చి 27, 2026న పాన్-ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Read also-first Telugu talkie: తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఏంటో తెలుసా.. హీరో ఎవరంటే?

ఈ ప్రోమోలో అసలు చికిరీ అంటే ఎంటో తెలియని ఏఆర్ రెహమాన్ కు చికిరీ గురించి వివరించారు. ఏఆర్ రెహమాన్ స్టూడియోలో బిజీగా ఉన్న రెహమాన్ అటెన్షన్ కోసం బుచ్చి వెయిట్ చేస్తాడు. చాలా సేపటికి బుచ్చి వైపు చూసిన రెహమాన్ ఎప్పుడు వచ్చారు అని అడుగుతారు.. అప్పుడు చెప్తాడు.. బుచ్చి.. ‘సార్ నేనే ఏడో క్లాసులో ఉన్నపుడు మీ పాటలు వినమని నా కజిన్ బాబి చెప్పాడు సార్, అప్పుడు వాటికి నేనే ఫ్యాన్ అయిపోయాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి అంటే మొన్న వచ్చిన గ్లింప్స్ అదిరిపోయాయని టాక్ ఇప్పుడు మళ్లీ అలాంటిది ఒకటి ఇద్దాం సార్. ఈ సారి ఆటతో కాదు పాటతో కొడదాం సార్. సందర్భం ఏంటంటే.. పెద్ది గాడు కొండల్లో ఉన్న తన చికిరీని చూసి పాడుకునే సాంగ్. అసలు చికిరీ అంటే ఏంటంటే.. అలంకరణ అక్కర్లేని అమ్మాయి, అందమైన అమ్మాయి అని అర్థం. దీనిని హుక్ తీసుకుని పాట చేసేద్దాం సార్ ’ అని బుచ్చి అంటారు. దీనికి ఏఆర్ రెహమాన్ పాటను పాడి వినిపిస్తాడు. దానికి బుచ్చి ఇలాంటిదే కావాలంటూ ఆనందంలో మునిగిపోతాడు. చివరిగా పాటకు సంబంధించిన హుక్ ప్రోమో ఉంటుంది. ఈ చికిరీ ఫుల్ సాంగ్ కోసం నవంబర్ 7 వరకూ ఆగాల్సిందే. దీనిని చూసిన మెగా ఫ్యాన్స్ పాట హుక్ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Just In

01

Illegal Ration Rice: అక్రమంగా తరలిస్తున్న 295 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. ఎక్కడంటే..?

Smartphones Under rs 30000: రూ.30 వేలలో టాప్ కెమెరా ఫోన్లు.. ఐఫోన్ రేంజ్ క్వాలిటీ.. ఫొటోలు, ఇన్‌స్టా రీల్స్‌కు బెస్ట్ ఛాయిస్!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఇంట్లో దెయ్యాలు.. సుమన్ శెట్టి గేమ్ స్టార్ట్స్!

Jagadish Reddy: కమీషన్ల కోసమే ఎస్ఎల్బీసీ పనులు.. జగదీశ్వర్ రెడ్డి ఫైర్..!

Purusha first look: ‘పురుషః’ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది చూశారా.. ఇదేదో వెరైటీగా ఉందే..