Tandur Protest (imagecredit:swetcha)
తెలంగాణ

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Tandur Protest: ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వాలు
–ఇరుకైన గుంతల రోడ్లతో నిండు ప్రాణాలు బలి
–రోడ్లెక్కి ఆందోళన చేస్తున్న ప్రజలు
–తాండూర్​ పట్టణంలో బైటాయించిన వైనం
–పార్టీలకు అతీతంగా కదిలోచ్చిన నేతలు

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వాలు మారుతున్నప్పటికి ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కరువైయ్యనట్లు ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. తాండూర్​ డెవలప్మెంట్​ ఫోరమ్​(Tandoor Development Forum) ఆధ్వర్యంలో పట్టణంలోని విలియం మూన్​ చౌరస్థా వద్ద స్థానికులు మంగళవారం ఆందోళన చేశారు. రాష్ట్ర రాజధాని నుంచి వికారాబాద్(Vikarabad)​ జిల్లాకు ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.

బాధిత కుటుంబ సభ్యుల ప్లకార్డులు..

వికారాబాద్​ జిల్లాలోని తాండూర్​ నియోజకవర్గంలోను ఆధ్వాన్నంగా రోడ్ల పరిస్థితి ఉందని స్థానికులు వివరిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందులో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ప్రజలు వివరిస్తున్నారు. చేవెళ్ల(Chevella) మండలం మీర్జాగూడ ఆర్టీసీ బస్సు(RTC Bus) ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వచ్చారు. పార్టీలకతీతంగా పలు పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చౌరస్తాకు అన్నివైపులా రాకపోకలు స్తంభించాయి.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో సెన్సెస్ ప్రీ టెస్ట్ ప్రారంభం: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్

ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల..

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) నిరసన వద్దకు చేరుకొని మద్దతు తెలిపారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు హైదరాబాద్(Hyderabad) రోడ్డును బాగుచేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పేద ప్రజల ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో కలుస్తున్నాయని మండిపడ్డారు. జోరుగా వర్షం కురుస్తున్న కూడా లేక చేయకుండా నిరసన కొనసాగించారు. తాండూర్ తాసిల్దార్ తారా సింగ్(Tara Singh) కు వినతి పత్రం అందజేశారు. రెండు గంటల పాటు నిరసన కొనసాగింది. నిరసనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Also Read: Kishan Reddy: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నా: కిషన్ రెడ్డి

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..