shiva-4k( X)
ఎంటర్‌టైన్మెంట్

Shiva 4K: నాగార్జున ‘శివ’4కే ట్రైలర్ వచ్చేది అప్పుడే.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

Shiva 4K: కింగ్ నాగార్జున కెరీర్ ను మలుపుతిప్పిన సినిమాల్లో ప్రధమంగా చెప్పుకునేది రామ్ గోపాల్ వర్మ ‘శివ’ . అప్పట్లో ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ సినిమాగా నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 14,2025న 4కే వర్షన్ డాల్బీ సౌండ్ యాడ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. దీనికి సంబంధించిన వార్త కింగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం టైలర్ ను నవంబర్ 4,2025న రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను అమీర్ పేట్ లో ఉన్న సత్యం థియేటర్ లో నిర్వహించనున్నారు. అయితే 4కేలో వస్తున్న ట్రైలర్ ఎలా ఉండబోతుందా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Telugu heroines: తెలుగు రాష్ట్రాలనుంచి హీరోయిన్‌లు ఎందుకు రావడంలేదు.. పక్కరాష్ట్రం వెళ్లాల్సిందేనా!

తెలుగు సినీ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చిన చిత్రం అంటే అది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన “శివ”. నాగార్జున, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కాలేజీ నేపథ్యంలో జరిగే విద్యార్థి రాజకీయాలు, గ్యాంగ్ వార్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ యువకుడు సిస్టమ్‌కు వ్యతిరేకంగా ఎలా నిలబడతాడో చూపించిన ఈ కథ, తన యాక్షన్ సన్నివేశాలు, నిజజీవితానికి దగ్గరగా ఉన్న ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సైకిల్ చైన్ ఫైట్ సీన్ సినిమాకు ఐకానిక్ సీక్వెన్స్‌గా మారింది. రఘువరన్ చేసిన విలన్ పాత్ర, నాగార్జున పెర్ఫార్మెన్స్, ఇళయరాజా సంగీతం అన్నీ కలిసి సినిమాను ఒక సూపర్ హిట్ మూవీగా మలిచాయి.

Read also-Smriti Mandhana: ప్రముఖ సంగీత దర్శకుడితో పెళ్లికి రెడీ అవుతున్న క్రికెటర్ స్మృతి మందాన!

శివ చిత్రం తెలుగు సినిమాకు కొత్త దిశను చూపించడమే కాకుండా, రామ్ గోపాల్ వర్మను దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. సాంకేతిక నాణ్యత, కెమెరా యాంగిల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ కాలానికి మించి ఉండి, కొత్త తరం దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. “శివ” ప్రభావం తరువాతి దశాబ్దాల తెలుగు సినిమాల మీద స్పష్టంగా కనిపించింది. ఇప్పటికీ ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, రీ-రిలీజ్ ద్వారా కొత్త తరం ప్రేక్షకులకు మరోసారి ఆ యుగాన్ని గుర్తు చేస్తోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన క్లాసిక్ చిత్రం “శివ” ఇప్పుడు 4K రీమాస్టర్డ్ వెర్షన్‌గా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ 4K వెర్షన్‌ను డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో రూపొందించి, నవంబర్ 14, 2025న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా రీ-రిలీజ్ అవుతోంది.

Just In

01

Dheeraj Mogilineni: వేస్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై ‘ది గర్ల్ ‌ఫ్రెండ్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!