Tadepalli ycp building
Politics

Amaravathi:తాడేపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

AP government takes decession to destroy the ycp building:
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని శనివారం ఉదయం అధికారులు కూల్చివేశారు. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం అక్కడ బోట్ యార్డ్ స్థలంగా ఉంది. దానిని అతి అత్యంత తక్కువ ధరకు లీజు కు తీసుకుని జగన్ సర్కార్ భవన నిర్మాణం చేపట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది.
శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సీఆర్డీయే అధికారులు రంగంలో దిగి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. ప్రొక్లైన్ లు, బుల్డోజర్స్‌తో భవనాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం ఆ భవనం నిర్మాణ దశలో ఉంది.

శుక్రవారం నోటీసులు

నీటిపారుదలశాఖ స్థలంలో అక్రమంగా భవనాన్ని నిర్మిస్తున్నట్లు శుక్రవారం వైసీపీకి సీఆర్డీయే నోటీసు ఇచ్చింది. సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. న్యాయస్థానంలో ఆ పార్టీ తరపున వాదనలు వినిపించారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. అయితే న్యాయస్థానం ఆదేశాలను సీఆర్డీయే కమిషనర్‌కు వైసీపీ తరపు న్యాయవాది తెలిపినట్టు వార్తలు వస్తున్నా యి. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి భవనాన్ని కూల్చివేయడంతో ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు వైసీపీ పెద్దలు.

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే