Premante Teaser: ప్రియదర్శి (Priyadarshi), ఆనంది (Anandi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’ (Premante). సుమ కనకాల (Suma Kanakala) ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రాన్ని పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్‌కు ట్రిబ్యుట్‌గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ (Premante Teaser) ఎలా ఉందంటే..
Also Read- Sudheer Babu: మహేష్ సపోర్ట్ తీసుకోలేదు.. సుధీర్ బాబు స్కెచ్ ఏంటి?
కథలో మలుపు తిప్పే పాత్రలో..
టీజర్‌లో కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపును ఇందులో హిలేరియస్‌గా చూపించారు. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సమస్యలతో ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది ఇందులో తెలుపుతున్నట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించడంతో పాటు, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. ఇక సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇవ్వడంతో.. కథలో కొత్త మలుపు ఉంటుందని అర్థమవుతోంది. ఆమె పాత్ర హ్యుమర్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఈ చిత్రాన్ని సిట్యువేషనల్ హ్యుమర్‌తో మనసుకు హత్తుకునే ఎమోషన్స్‌తో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ‘ప్రేమంటే’ అనే టైటిల్‌కు తగ్గట్లుగానే, ప్రేమలోని కలలు, వాస్తవాల మధ్య తేడాను చూపిస్తూ టీజర్‌ను ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు. ప్రియదర్శి, ఆనంది జంట మధ్య కెమిస్ట్రీ సహజంగానూ, చూడముచ్చటగానూ వుంది. సుమ కనకాల ప్రజెన్స్ కట్టిపడేస్తే.. వెన్నెల కిషోర్ తన సిగ్నేచర్ టచ్‌తో నవ్వులు పంచారు. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read- Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’.. మరో అప్డేట్ వచ్చేసింది
పవర్ లెస్ కానిస్టేబుల్
టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. నా వెనుక ఉండి ముందుకు నడిపిస్తున్న మా టీమ్ అందరికీ థాంక్స్. ఈ సినిమాను అంతా ఎంతో ప్రేమతో చేశాం. టీజర్ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరిని థియేటర్స్‌లో కలుద్దామని అనుకుంటున్నాను. నవంబర్ 21 గుర్తుపెట్టుకోండని చెప్పారు. సుమ కనకాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కోసం నన్ను తీసుకున్నందుకు థ్యాంక్స్. కానీ సీన్ చేసిన తర్వాత అది పవర్ లెస్ కానిస్టేబుల్ అని అర్థమైంది. విశ్వనాథ్ చాలా అద్భుతంగా ఇందులో విజువల్స్‌ని చూపించారు. జాన్విని చూస్తే చాలా కూల్‌గా అనిపిస్తుంది. ఆనంది చాలా చక్కటి పెర్ఫార్మర్. దర్శి నేచురల్ యాక్టర్. ఇందులో ఆనంది, దర్శి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. నవనీత్ మంచి స్క్రిప్ట్‌తో వచ్చారు. ఇందులో నాకు ఒక పాట కూడా ఉంది. దానికి ఒక హుక్ స్టెప్ కూడా ఉంది, నవంబర్ 21న తప్పకుండా అందరూ సినిమా థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇంకా చిత్ర బృందం ప్రసంగించింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
