45-the-movie( image :X)
ఎంటర్‌టైన్మెంట్

45 The Movie: ‘45 ది మూవీ’ నుంచి ‘అఫ్రో టపాంగ్’ సాంగ్ వచ్చింది చూశారా..

45 The Movie: కన్నడ సినీ పరిశ్రమలో మరో కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి అగ్ర నటులతో అర్జున్ జన్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘45 ది మూవీ’. ఈ మూవీని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ‘45 ది మూవీ’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో భారీ హైప్‌ను పెంచేశాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం ఓ క్రేజీ సాంగ్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

Read also-Film stars in politics: సినిమాల్లో పాపులర్ అయితే రాజకీయాల్లో రాణించవచ్చా.. అలా ఎంత మంది సక్సెస్ అయ్యారు..

‘గెలుపు తలుపు దొరికే వరకు దిగులుపడుకురా’ అంటూ సాగే ఈ క్రేజీ సాంగ్‌కు రోల్ రైడా తెలుగులో సాహిత్యాన్ని అందించారు. రోల్ రైడా, వినాయక్ కలిసి ఆలపించిన ఈ పాటకు జానీ మాస్టర్ క్రేజీ స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. ఈ వీడియో సాంగ్‌లోని వాతావరణం, చుట్టూ కనిపిస్తున్న ఆ ఆఫ్రికన్స్ వారితో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇక ఈ పాటలో శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి క్రేజీగా కనిపిస్తున్నారు. అర్జున్ జన్య ఇచ్చిన బాణీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను అయితే తెగ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

Read also-Sudheer Babu: అక్కడ కష్టాలు తెలియకపోవచ్చు.. కానీ బాధను అనుభవించా.. సుధీర్ బాబు

ఈ సినిమాకు డాక్టర్ కె రవి వర్మ, జాలీ బాస్టియన్, డిఫరెంట్ డానీ చేతన్ డిసౌజా వంటి వారు పోరాట సన్నివేశాల్ని కంపోజ్ చేయగా, అనిల్ కుమార్ మాటల్ని అందించారు. ఇక ఈ మూవీకి సత్య హెగ్డే కెమెరామెన్‌గా, కె.ఎం. ప్రకాష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 25న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదల కోసం శివరాజ్ కుమార్, ఉపేంద్ర అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. అర్జున్ జన్య ఈ సినిమాకు కథ, సంగీతం, దర్శకత్వం వహిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. కె. ఎం ప్రకాష్ ఎడిటర్ గా.. రోల్ రిడా, వినాయక్ గాయకులుగా ఉన్నారు.

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?