jathadhara( image ;x)
ఎంటర్‌టైన్మెంట్

Sudheer Babu: అక్కడ కష్టాలు తెలియకపోవచ్చు.. కానీ బాధను అనుభవించా.. సుధీర్ బాబు

Sudheer Babu: సుధీర్ బాబు హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘జటాధర’. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ తన జీవితంలో డబ్బు ఉన్నా కానీ తాను పడిన కష్టాలు చాలా బాధను కలిగించాయని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా నవంబర్ 7, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ తన సినీ ప్రయాణంలోని భావోద్వేగాలను, కష్టాలను పంచుకున్నారు. అతని స్పీచ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకూ తాను ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం నానుంచి మాత్రమే వచ్చేలా కష్టపడ్డానన్నారు. మహేశ్ బాబు బావగా ఉండటం గర్వకారణమైనా, ఆ బంధుత్వంపై ఆధారపడకుండా తన కెరీర్‌ను నిర్మించుకున్నానని సుధీర్ బాబు భావోద్వేగంగా చెప్పారు.

Read also-King First Look: కింగ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. 60వ పుట్టినరోజున ట్రైలర్ హింట్ ఇచ్చిన షారుఖ్ ఖాన్

వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ‘జటాధార’ సినిమా, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సొనాక్షి సిన్హా టాలీవుడ్‌లో మొదటి సినిమాగా ఈ చిత్రంలో భాగస్వామి అవుతున్నారు. శిల్పా శిరోద్కర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈవెంట్‌కు దర్శకులు శైలేష్ కొలను, యదు వంశీ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సుధీర్ బాబు పాత్ర గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా నా కెరీర్‌లో మరో మైలురాయి” అని చెప్పారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు మాట్లాడుతూ, తన సినీ ప్రయాణం గురించి గుర్తుచేసుకున్నారు. “కృష్ణగారికి అల్లుడు, మహేశ్ బాబుకి బావ అనే గుర్తింపు నాకు గర్వకారణం. కానీ ఇది బాధ్యత కూడా. ‘సుధీర్ బాబు అంటే ఎవరు?’ అని తాను తాను ప్రశ్నించుకున్నాను. నటుడిగా మారాలనే కోరికను అణచివేయాలనుకున్నా, ఆగలేకపోయాను” అని చెప్పారు.

“ఫిల్మ్‌నగర్‌లో కష్టాలు పడ్డాను. అక్కడ ఉన్న చాలా ఆఫీసులకు వెళ్లి తలుపులు తట్టేవాడిని, వారు అప్పుడు నన్ను గౌరవించి అదనంగా ఒక కప్ కాఫీ మాత్రం ఇచ్చేవారు. అంతే తప్పితే ఎక్కడా అవకాశాలగురించి మాత్రం మాట్లాడేవారు కాదన్నారు. కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిల్మ్‌నగర్ బాధలు నాకు తెలుసు. బస్సుల్లో తిరగకపోయినా, కారులో కూర్చుని ఏడ్చాను!” అని భావోద్వేగంగా చెప్పారు. ఇది సానుభూతి కోసం కాదు, నిజ జీవిత అనుభవాలని స్పష్టం చేశారు.

Read also-Andhra King Taluka: ఆ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన రామ్ పోతినేని.. ఇక విడుదలే తరువాయి..

‘‘మొదట్లో నాలో ఎన్నో లోపాలను ఎత్తి చూపించేవారు. వాటన్నింటినీ తీసుకున్నా.. వాయిస్ మీద కామెంట్లు వచ్చాయి, కాబట్టి ట్రైనింగ్ తీసుకున్నాను. ‘బాడీ చూపిస్తాడు’ అన్నారు, ‘సమ్మోహనం’ చేశాను. ‘సాఫ్ట్ సినిమాలకు సెట్ అవుతాడు’ అన్నారు, ‘వి’లో నటించాను. ‘అర్బన్ స్టోరీలు మాత్రమే’ అన్నారు, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చేశాను. “హిట్స్, ఫ్లాప్స్ రెండూ నా బాధ్యత” అని స్పష్టం చేశారు. దీంతో సుధీర్ బాబు మరింత మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనే చెప్పాలి. ఈ సినిమా విడుదల కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

ISRO CMS-03: 4,410 కేజీల ఉపగ్రహాన్ని మోసుకొని నింగిలోకి దూసుకెళ్లిన బహుబలి రాకెట్

Telugu Indian Idol Season 4: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విన్నర్ ఎవరంటే?

India victory: వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా సునాయాస విజయం

Prasanth Varma: రెండు వైపులా విషయం తెలుసుకోండి.. మీడియా సంస్థలపై చురకలు!

Womens World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్ ఎవరిదంటే?