Telugu Directors: టాలీవుడ్‌లో ప్రతి దర్శకుడి కెరీర్‌లో హైస్, లోస్ సహజమే. కానీ కొందరి విషయంలో ఆ దిశ స్పష్టంగా కనిపించకపోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉన్న ఇద్దరు ప్రతిభావంతులైన దర్శకులు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), పరశురామ్ (Parasuram). ఇద్దరూ స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్లు ఇచ్చినా, ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల విషయంలో అనిశ్చితి నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Mahesh and Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి మధ్య ఆసక్తికర సంభాషణ.. సోషల్ మీడియా షేక్!
పవన్ కళ్యాణ్ ఓకే అంటారా?
మొదటగా వంశీ పైడిపల్లి విషయానికి వస్తే.. మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’ (Maharshi) సినిమా ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత విజయ్‌తో చేసిన ‘వారసుడు’ (Varisu) తమిళంలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలిచినా, తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో వంశీ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ వైపు అడుగులు వేశాడు. ఆమిర్ ఖాన్‌కి ఒక స్ర్కిప్ట్ వినిపించి, ఆయనను బాగా ఇంప్రెస్ చేశాడని సమాచారం. కానీ చివరి నిమిషంలో ఆమిర్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ప్లాన్ నిలిచిపోయింది. ఆ తర్వాత అదే కథను సల్మాన్ ఖాన్‌తో చేయాలనుకున్నా, అక్కడ కూడా నిరాశే ఎదురైందని తాజాగా టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ కథను పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించాలన్న ఆలోచనలో దిల్ రాజు ఉన్నారని ఫిల్మ్ నగర్‌లో చర్చలు వినిపిస్తున్నాయి. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
ఇద్దరు దర్శకులు ప్రతిభావంతులే అయినా
ఇదే సమయంలో పరశురామ్ పరిస్థితి కూడా సేమ్ ఇలానే ఉంది. ‘గీత గోవిందం’ (Geetha Govindham)తో సూపర్ హిట్ కొట్టిన ఆయన, ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత నుంచి కొత్త ప్రాజెక్ట్‌పై స్పష్టత రాలేదు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వంలో సినిమా వస్తుందనే వార్తలు వినిపించినా, అధికారిక ప్రకటన లేదు. దీంతో పరశురామ్ ఎవరితో సినిమా చేస్తాడు? ఏ బ్యానర్ నుంచి ప్రాజెక్ట్ వస్తుంది? అనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. టాలీవుడ్‌లో ఈ ఇద్దరు దర్శకులు ప్రతిభావంతులే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త సినిమా మొదలు పెట్టే దశకు రాలేకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. స్టార్ హీరోల డేట్స్ అరుదుగా దొరకడం, స్క్రిప్ట్ అప్రూవల్ ప్రాసెస్ ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్టులు స్టక్ అయ్యాయి. మొత్తానికి, వంశీ పైడిపల్లి – పరశురామ్ ఇద్దరూ తాము తిరిగి హిట్ ట్రాక్‌లోకి రావాలంటే సరైన స్టార్ కాంబినేషన్, స్ట్రాంగ్ కంటెంట్ ఎంపిక చాలా కీలకం. ఇక ఈ ఇద్దరి కెరీర్ ఎటు తిరుగుతుందో, సమయం మాత్రమే చెప్పగలదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
