Ponnam Prabhakar (imagecredit:swetcha)
తెలంగాణ

Ponnam Prabhakar: పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ఈనెల 29వ తేదీన ఇంతకుముందున్నడు లేని విధంగా జిల్లాలో కురిసిన వర్షానికి నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో అతి భారీ వర్షం సంభవించి ప్రజలకు అపార ప్రాణ మరియు ఆస్తి నష్టం కలిగించిందని, పంట చేలలో ఉన్న వరి మరియు ఇతర పంటలే కాకుండా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అమ్మడం కోసం తీసుకువచ్చిన వరిధాన్యంలో 90 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పూర్తిగా కొట్టుకపోవడమే కాకుండా వేలాది మెట్రిక్ టన్నుల వరిధాన్యం అకాల వర్షానికి తడిచి రైతులకు అపార నష్టాన్ని కలిగించిందని అన్నారు.

నష్టపోయిన రైతులకు..

ఈ అపారనష్టం పై వెంటనే స్పందించి స్వయంగా నేను మరియు జిల్లా కలెక్టర్ కె. హైమావతి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలాలు మరియు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో గల హుస్నాబాద్(Husnabad) వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టడం జరిగిందని, అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వద్ద వరదలో గల్లంతయి మృత్యువాత పడ్డ ముగ్గురి కుటుంబాలను, మరియు అధిక వర్షాలతో మృత్యువాత పడ్డ ఎనిమిది పశువుల యజమానులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గారితో కలిసి ఏరియల్ సర్వే ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో పంట నష్ట తీవ్రతను, చెడిపోయిన రహదారులను, కల్వర్టులను పరిశీలించి హనుమకొండ కలెక్టరేట్ లో అధికారులతో వరద నష్టం పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో అధిక వర్షాలతో ప్రధాన రహదారితోపాటు వివిధ కాలనీలలో నిలిచిన వరద నీటితో ప్రజలు పడ్డ ఇబ్బందులు భవిష్యత్తులో కలగకుండా హుస్నాబాద్ పట్టణంలో మురుగునీరు, వరదనీరు డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణానికి 80 కోట్ల రూపాయల తో డిపిఆర్ ను రూపొందించడం జరిగిందని అన్నారు.

Also Read: Hydra: రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!

నష్టంను ప్రాథమికంగా గుర్తించడం..

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలతో 3491 మంది రైతులకు సంబంధించిన 4844 ఎకరాల్లో వరి, 393 రైతులకు సంబంధించిన 588 ఎకరాల్లో పత్తి, 32 రైతులకు సంబంధించి 51 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం కలిగిందని, వాటిలో హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో 2565 మంది రైతులకు సంబంధించిన 3454 ఎకరాలలో వరి, 24 మంది రైతులకు సంబంధించిన 37 ఎకరాల మొక్కజొన్న, 290 మంది రైతులకు సంబంధించిన 454 ఎకరాల పత్తి పంట నష్టంను ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని అన్నారు. వాటితోపాటు అధిక వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్లను, కల్వర్ట్లను గుర్తించి వాటి పునరుద్ధరణ పనులతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాశ్వత నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో అధిక వర్షాలతో తడిసిన 100 మంది పైగా రైతులకు చెందిన 230 మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం తడువగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తడిచిన ఆ వరి ధాన్యాన్ని మద్దతు ధరతో సేకరించి రైస్ మిల్లులకు తరలించడం

Also Read: Jogulamba Gadwal: ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు.. పరామర్శించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు

Just In

01

Transport Department: రవాణా శాఖలో సమాచారం మిస్? కనిపించని సమాచార హక్కు బోర్డు!

Sudheer Babu: అక్కడ కష్టాలు తెలియకపోవచ్చు.. కానీ బాధను అనుభవించా.. సుధీర్ బాబు

EV Charging Stations: ఎలక్ట్రిక్ వాహనదారులకు బేఫికర్.. త్వరలో సర్కార్ ఆఫీసుల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు!

Annabelle in Delhi: ఢిల్లీ వీధుల్లో అన్నాబెల్.. హాలోవీన్ మేకప్ వీడియో వైరల్.. చూసిన వాళ్లు అరుస్తూ పారిపోయారు?

Illegal Land Surveys: దళిత రైతుల భూములపై అక్రమ సర్వేలు.. ఐకెపి కమ్యూనిటీ సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్!