CM met Pocharam at home
Politics

Hyderabad: రైతు సంక్షేమం కోసం సలహాలు తీసుకుంటాం

CM Reventh Reddy met BRS ex speaker Pocharam Srinivas Reddy at his Home:
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తున్నారా..? పంచాయతీ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ఎస్పీని త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, బీఆర్ఎస్ఎల్పీ విలీనం కోసం కావాల్సిన 13 మంది ఎమ్మెల్యేల కోసం స్వయంగా సీఎం రంగంలోకి దిగినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధిలోని వారేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారంను కాంగ్రెస్‌లోకి రావాలంటూ సీఎం రేవంత్‌‌రెడ్డి ఆహ్వానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీలోకి రావాలంటూ ఒత్తిడి చేసినట్లుగా సమాచారం. అయితే, కేసీఆర్‌పై ఉన్న స్వామి భక్తితో పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా.. లేక నో చెబుతారా అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రైతు సంక్షేమనికి కృషి

తెలంగాణ ప్రాంత రైతుల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతుల  సంక్షేమం కోసం పోచారం కృషి చేశారని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. రైతుల బాగోగుల కోసం పోచారం సలహాలు తీసుకుంటామని తెలిపారు. రైతాంగాన్ని పటిష్టం చేయడానికి పోచారంను పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరగానే పోచారం ఓకే చెప్పారని అన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అనేల తమ ప్రభుత్వం చేయబోతుందని తెలిపారు. తమది రైతు రాజ్యం రైతు ప్రభత్వమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

13 మందిపై ఫోకస్

బీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్, ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. కబురు పంపిన వెంటనే పార్టీలో చేరేందుకు సదరు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఒకరు..ఇద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా ఏకంగా బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ పోకస్ పెట్టినట్లు తెలిసింది. అందుకే పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఆ 13 మంది ఎమ్మెల్యేలను వెయిటింగ్‌లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?